Bigg Boss Adi Reddy : కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్‌బాస్ ఆదిరెడ్డి.. ఓపెనింగ్ గెస్ట్‌గా బిగ్‌బాస్ విన్నర్..

బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక సెలెబ్రిటీ హోదా తెచ్చుకొని యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ పలు టీవీ షోలలో పాల్గొన్నాడు. తాజాగా ఆదిరెడ్డి ఓ కొత్త బిజినెస్ మొదలుపెట్టాడు.

Bigg Boss Adi Reddy Started New Business Rahul Sipligunj come as Guest for Opening

Bigg Boss Adi Reddy : నెల్లూరుకి చెందిన ఆదిరెడ్డి ఒక చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ యూట్యూబ్ లో రివ్యూలు, వీడియోలు పోస్టుచేసేవాడు. బిగ్‌బాస్‌పై ఆది వీడియోలు చేయడం మొదలుపెట్టాక కొంచెం పాపులారిటీ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ వీడియోలతో పేరు తెచ్చుకున్న ఆదిరెడ్డికి బిగ్ బాస్ లోకి పిలుపు రావడంతో ఒక్కసారిగా అతని లైఫ్ మారిపోయింది. ఆ షోతో స్టార్ అయిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న ఆదిరెడ్డి ఫైనల్ కి వెళ్లి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక సెలెబ్రిటీ హోదా తెచ్చుకొని యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ పలు టీవీ షోలలో పాల్గొన్నాడు. తాజాగా ఆదిరెడ్డి ఓ కొత్త బిజినెస్ మొదలుపెట్టాడు. విజయవాడలో(Vijayawada) ప్రముఖ సెలూన్ కంపెనీ జావేద్ హబీబ్(Jawed Habib) బ్రాంచ్ తీసుకొని ప్రారంభించాడు. ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి సింగర్, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా వచ్చాడు.

Also Read : Redin Kingsly : లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న కమెడియన్.. 46 ఏళ్ళకి మూడుముళ్లు..

రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) కూడా గతంలో బార్బర్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆదిరెడ్డి సెలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి రాహుల్ వెళ్లడంతో ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఈ ఓపెనింగ్ కార్యక్రమం ఫోటోలు ఆదిరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మా కోసం విజయవాడ వచ్చి సెలూన్ ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ రాహుల్ సిప్లిగంజ్ అన్న. నా లైఫ్ లో ఇది మొదటి బిజినెస్. దీని వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రస్తుతం 15 మందికి వర్క్ ఇస్తున్నాము, దానికి చాలా సంతోషంగా ఉంది అని ఎమోషనల్ పోస్ట్ చేశాడు. దీంతో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆదిరెడ్డికి కంగ్రాట్స్ తెలుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు