Redin Kingsly : లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న కమెడియన్.. 46 ఏళ్ళకి మూడుముళ్లు..

ఇటీవల డాక్టర్, బీస్ట్, జైలర్ సినిమాలతో స్టార్ కమెడియన్ అయిపోయాడు రెడిన్‌ కింగ్‌స్లీ. ప్రస్తుతం తమిళ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Redin Kingsly : లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న కమెడియన్.. 46 ఏళ్ళకి మూడుముళ్లు..

Tamil Comedian Redin Kingsly Married Actress Sangeetha at the age of 46 Photos goes Viral

Updated On : December 11, 2023 / 9:43 AM IST

Redin Kingsly : తమిళ నటుడు రెడిన్‌ కింగ్‌స్లీ ఇటీవల మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈవెంట్ ఆర్గనైజర్ గా ఉన్న రెడిన్‌ కింగ్‌స్లీ గతంలో పలు సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా చేసాడు. 2018లో కోలమవు కోకిల సినిమాతో కమెడియన్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ సినిమా మంచి విజయం సాధించి కింగ్‌స్లీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పట్నుంచి తమిళ్ సినిమాల్లో వరుస ఛాన్సులు వస్తున్నాయి.

ఇటీవల డాక్టర్, బీస్ట్, జైలర్ సినిమాలతో స్టార్ కమెడియన్ అయిపోయాడు రెడిన్‌ కింగ్‌స్లీ. ప్రస్తుతం తమిళ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా కింగ్‌స్లీ వైరల్ అవుతున్నాడు. అందుకు కారణం పెళ్లి చేసుకోవడమే. 46 ఏళ్ళ వయసు ఉన్న రెడిన్‌ కింగ్‌స్లీ ఇన్నాళ్లు సింగిల్ గా ఉండి ఇప్పుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.

Also Read : Varun Lavanya : హనీమూన్‌లో వరుణ్ లావణ్య క్రిస్మస్ సెలబ్రేషన్స్..

గత సంవత్సరం కాలంగా నటి సంగీతతో ప్రేమలో ఉన్న రెడిన్‌ కింగ్‌స్లీ తాజాగా నిన్న మైసూరు చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆమెతో వివాహం చేసుకున్నాడు. దీంతో వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సంగీత తమిళ్ సీరియల్స్ లో నటిస్తుంది. పలు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేసింది. 46 ఏళ్ళ వయసులో ఈ కమెడియన్ ప్రేమ పెళ్లి చేసుకోవడంతో వీరి పెళ్లి వార్తల్లో నిలుస్తుంది. ఇక పలువురు ప్రముఖులు, నెటిజన్లు రెడిన్‌ కింగ్‌స్లీ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.