Varun Lavanya : హనీమూన్‌లో వరుణ్ లావణ్య క్రిస్మస్ సెలబ్రేషన్స్..

వరుణ్ లావణ్య ఇటీవలే హనీమూన్ కి వెళ్లారు. అత్యంత చల్లని ప్రదేశం అయిన ఆర్కిటిక్ దగ్గరగా ఉండే ఫిన్లాండ్(Finland) దేశంలోని ల్యాప్ లాండ్ అనే ఏరియాకు వెళ్లారు.

Varun Lavanya : హనీమూన్‌లో వరుణ్ లావణ్య క్రిస్మస్ సెలబ్రేషన్స్..

Varun Tej Lavanya Tripathi Christmas Celebrations in Honeymoon

Updated On : December 11, 2023 / 8:02 AM IST

Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ఇటీవల లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ రెండు కుటుంబాలని ఒప్పించి నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు, సన్నిహితుల మధ్యే వరుణ్ లావణ్య వివాహం జరిగింది. అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రెసెప్షన్ కూడా ఎర్పాటు చేశారు. పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య ఎక్కడికి వెళ్లినా, వారి ఫోటో బయటకి వచ్చినా వైరల్ అవుతున్నారు.

వరుణ్ లావణ్య ఇటీవలే హనీమూన్ కి వెళ్లారు. అత్యంత చల్లని ప్రదేశం అయిన ఆర్కిటిక్ దగ్గరగా ఉండే ఫిన్లాండ్(Finland) దేశంలోని ల్యాప్ లాండ్ అనే ఏరియాకు వెళ్లారు. అక్కడ -10 డిగ్రీల చలిలో, మంచు కురుస్తుంటే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫిన్లాండ్ నుంచి పలు ఫోటోలు కూడా తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Also Read : Samantha : అనాథ పిల్లలతో కలిసి ‘హాయ్ నాన్న’ సినిమా చూసిన సమంత..

ఇప్పటికే మంచులో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేయగా తాజాగా అక్కడ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోలు షేర్ చేశారు ఈ జంట. ప్రస్తుతం ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. దీంతో ఈ జంట అక్కడ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ, క్రిస్మస్ చెట్టుతో, మంచులో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. మరి ఈ ట్రిప్ ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తారో? ఇంకెన్ని ఫోటోలు పోస్ట్ చేస్తారో చూడాలి.