Samantha : అనాథ పిల్లలతో కలిసి ‘హాయ్ నాన్న’ సినిమా చూసిన సమంత..

తాజాగా నిన్న రాత్రి సమంత నడిపిస్తున్న ప్రత్యూష ఫౌండేషన్ లోని పలువురు అనాధ పిల్లలతో కలిసి హైదరాబాద్ AMB సినిమాస్ లో హాయ్ నాన్న(Hi Nanna) సినిమా చూసింది.

Samantha : అనాథ పిల్లలతో కలిసి ‘హాయ్ నాన్న’ సినిమా చూసిన సమంత..

Samantha Watched Hi Nanna Movie with Orphan Kids from Prathyusha Foundation

Updated On : December 11, 2023 / 7:45 AM IST

Samantha : సమంత ప్రస్తుతం కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉండి తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది. పలు దేశాలు తిరిగేస్తూ మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఇటీవలే భూటాన్ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చిన సమంత తన బిజినెస్ లు, ఫౌండేషన్స్ మీద ఫోకస్ పెట్టింది. కొన్ని రోజుల క్రితమే తాను నడిపిస్తున్న ఏకమ్ స్కూల్స్ పిల్లల్ని కలిసింది సమంత. వారితో కాసేపు సరదాగా గడిపింది.

తాజాగా నిన్న రాత్రి సమంత నడిపిస్తున్న ప్రత్యూష ఫౌండేషన్ లోని పలువురు అనాధ పిల్లలతో కలిసి హైదరాబాద్ AMB సినిమాస్ లో హాయ్ నాన్న(Hi Nanna) సినిమా చూసింది. పిల్లలకు సమంత టికెట్స్ తీసి వారికి హాయ్ నాన్న సినిమా చూపించి వారితో పటు కలిసి తాను కూడా సినిమా చూసింది. సమంతని చూడగానే ప్రత్యూష ఫౌండేషన్ పిల్లలు ఆశ్చర్యపోతూ ఆనందం వ్యక్తం చేశారు. సమంతతో మాట్లాడటానికి, ఆమెకి కరచాలనం చేయడానికి ఎగబడ్డారు.

Also Read : Bigg Boss 7 Day 98 : అనుకున్నట్టు ఈ వారం ఎలిమినేట్ అయింది వాళ్ళే.. ఫినాలేకి వెళ్ళింది ఎవరు?

దీంతో సమంత పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే సమంత నిన్న సాయంత్రమే తన సొంత నిర్మాణ సంస్థని ప్రకటించి త్వరలో సినిమాలు నిర్మిస్తానని తెలిపింది.