Bigg Boss contestant Tanuja Puttaswamy spent an entire day with the children at an orphanage.
Thanuja: బిగ్ బాస్ సీజన్ 9 ముగిశాక కంటెస్టెంట్స్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. కొంతమంది కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారు. కొంతమంది ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, రన్నరర్ గా నిలిచిన తనూజ పుట్టస్వామి మాత్రం నేను అందరికన్నా బిన్నం అంటోంది. మిగతా వారందరు తమ తమ ఫ్రెడ్స్, ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తుంటే, తనూజ మాత్రం అనాధ పిల్లలతో ఒక రోజంతా గడిపింది. వాళ్ళతో ఆడి, పాడి, భోజనం చేసి సరదాగా గడిపింది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Malavika Mohanan: రాజాసాబ్ ఈవెంట్ లో మాళవిక అందాలు.. బ్లాక్ డ్రెస్సులో కేకపుట్టిస్తోంది.. ఫొటోస్
అయితే, ఆ వీడియో చూసిన నెటిజన్స్ తనూజ(Thanuja)పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ తనూజ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వే విన్నర్ కావాల్సింది అంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దీంతో, సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ పెరుగుతూ వస్తోంది. ఇక బిగ్ బాస్ అనంతరం కూడా చాలా మంది కంటెస్టెంట్స్ బయట మీడియా ముందుకు వస్తుంటే తనూజ మాత్రం అసలు ఎక్కడ కనిపించడం లేదు. ఇదిలా ఉంటే, రీసెంట్ గా వచ్చే ఆదివారం టెలికాస్ట్ అవ్వబోయే ఒక షోకి సంబందించిన షూట్ రీసెంట్ గా జరిగింది.
ఈ షూట్ లో బిగ్ బాస్ సీజన్ 9కి సంబందించిన దాదాపు అందరు కంటెస్టెంట్స్ హాజరయ్యారు. కానీ, తనూజ మాత్రం పాల్గొనలేదు. కారణం ఏంటంటే, కొంతకాలం ఆమె ఈ షోలకి, మీడియాకి దూరంగా ఉండాలని అనుకుంటోందట. ఆలాగే, తన సమయాన్ని ఫ్యామిలీతో గడపాలని అనుకుందట. అందుకే చిన్న గ్యాప్ ఇచ్చినట్టు సమాచారం. అలాగే చాలా ఆఫర్స్ కూడా వస్తున్నాయట తనూజాకి. కానీ, ఆమెనే కావాలని సున్నితంగా తిరస్కరిస్తోందట. దీంతో, ఆమెపై తన ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.