Site icon 10TV Telugu

ముంబైలో రెస్టారెంట్ పెట్టి.. అక్కడే సెటిల్ అయిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు..

Bigg Boss Fame Actor Ali Reja Establish a Restaurant in Mumbai and Settled there with Family

Bigg Boss Contestant

సెలబ్రిటీలు అంతా బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడతారు, కొంతమంది సొంత బిజినెస్ లు నడిపిస్తారని తెలిసిందే. ఈ క్రమంలోనే నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా కూడా రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నాడు. సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న అలీ రెజా బిగ్ బాస్ తెలుగు సీజన్ లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. అనంతరం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు.

సోషల్ మీడియాలో, బయట కూడా బాగా యాక్టివ్ ఉండే అలీ రెజా గత కొన్నాళ్లుగా బయట, టీవీలో ఎక్కడా కనపడట్లేదు. తాజాగా అలీ రెజా క్లోజ్ ఫ్రెండ్ యాంకర్ రవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అలీ రెజా బాంబేలో రెస్టారెంట్ పెట్టాడు. అక్కడ బిజీ అయిపోయాడు. ఇప్పుడు కలవట్లేదు. ఒకప్పుడు రెండు ఫ్యామిలీలు రెగ్యులర్ గా కలిసే వాళ్ళము. నా కూతురు, అలీ రెజా కూతురు క్లోజ్ అని చెప్పుకొచ్చాడు.

Also Read : Rashmika Mandanna : సెలబ్రిటీలకు గిఫ్ట్స్ పంపిస్తున్న రష్మిక.. మై డియర్ రష్ అంటూ బన్నీ పోస్ట్.. ఏం పంపిస్తుందో తెలుసా?

అలీ రాజా ముంబైలో మరొకరితో కలిసి అఫ్జల్స్ మావో రెస్టారెంట్ ని స్థాపించాడు. ముంబైలో ఈ రెస్టారెంట్ సక్సెస్ ఫుల్ గానే నడుస్తుంది. ముంబైలో 5 బ్రాంచెస్ ఓపెన్ చేసారు. ఇటీవలే ఫుడ్ కి సంబంధించిన అవార్డులు కూడా తన రెస్టారెంట్ కి గెలుచుకున్నాడు. ప్రస్తుతం అలీ రెజా ముంబైలోనే తన ఫ్యామిలీతో సెటిల్ అయిపోయాడు. ఏదైనా సినిమా ఛాన్సులు వస్తే మాత్రం వచ్చి నటించి వెళ్లిపోయేలా ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తుంది.

 

Also See : Bigg Boss Soniya Akula : బిగ్ బాస్ సోనియా సీమంతం వేడుకలు.. ఫొటోలు..

Exit mobile version