×
Ad

Theppa Samudram : బిగ్‌బాస్ అర్జున్ అంబటి ‘తెప్ప సముద్రం’.. ఓటీటీలోకి.. ఎక్కడ..?

తాజాగా తెప్ప సముద్రం సినిమా ఓటీటీలోకి వచ్చింది.

  • Published On : August 3, 2024 / 04:13 PM IST

Bigg Boss Fame Arjun Ambati Theppa Samudram Movie Coming in OTT Details Here

Theppa Samudram : సీరియల్ నటుడు అర్జున్ అంబటి బిగ్‌బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అర్జున్ అంబటి హీరోగా తెరకెక్కిన ‘తెప్ప సముద్రం’ సినిమా ఏప్రిల్ 19న థియేటర్స్ లో రిలీజయింది. కిశోరి ధాత్రక్ హీరోయిన్ గా చైతన్య కృష్ణ, రవిశంకర్ ముఖ్య పాత్రల్లో సతీష్ రాపోలు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు.

Also Read : Keerthy Suresh : 21 ఏళ్ల వ‌య‌సులో బ్రెయిన్ ట్యూమ‌ర్‌తో మ‌ర‌ణం.. కీర్తి సురేష్‌ ఎమోష‌న‌ల్ పోస్ట్

తాజాగా తెప్ప సముద్రం సినిమా ఓటీటీలోకి వచ్చింది. రెగ్యులర్ గా కొత్త తెలుగు సినిమాలు, కొత్త షోలతో పలకరించే మన తెలుగు ఓటీటీ ఆహాలోకి తెప్ప సముద్రం సినిమా వచ్చేసింది. నేడు ఆగస్టు 3 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈ తెప్ప సముద్రాన్ని తెరకెక్కించారు. భవానీ మీడియా డిజిటల్ డిస్ట్రిబ్యుషన్ ద్వారా ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

https://www.youtube.com/watch?v=eTmbZES7oj4