Bigg Boss Nominations : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరెవరు..? అరుస్తూనే ఉన్న షాలిని.. ఎవరెన్ని చెప్పినా ఈమె మారదా..

నల్ గా ఈవారం నామినేషన్స్ లో వంశీ, అమన్, వర్షిణి, రోహిత్, షాలిని, రామ్ ప్రసాద్ లు ఉన్నారు. (Bigg Boss Nominations)

  • Published on- October 13, 2026 / 10:50 PM IST

Bigg Boss Nominations

Bigg Boss Nominations : బిగ్ బాస్ లో నిన్నటి నామినేషన్స్ నేడు కంటిన్యూ అయ్యాయి. నిన్న షాలిని.. మొదట దేబ్జానీని నామినేట్ చేయడంతో ఎపిసోడ్ ముగిసింది. నేడు రెండో నామినేషన్ వర్షిణి పేరు చెప్పింది. దీంతో వర్షిణి మాట్లాడుతుంటే షాలిని గొడవ పడింది. ఎప్పటిలాగే షాలిని సపోర్ట్ గా రోహిత్ వచ్చి గొడవ పడ్డాడు. మధ్యలో త్రిగుణ ఎంటర్ అయ్యాడు. షాలిని, రోహిత్ అగ్నిపరీక్ష గ్రూపిజం అని అందరికి తెలిసిందే. నాగార్జున కూడా చెప్పారు. మళ్ళీ ఇవాళ షాలిని కొత్తగా వచ్చిన శివ కుమార్ ని కూడా కలిపి సెలబ్రిటీల గ్రూప్ అనడంతో శివ గొడవ పడ్డాడు. ఇద్దర్ని నామినేట్ చేస్తే వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఒకర్ని ఫైనల్ చేయాలి కాబట్టి వర్షిణి ని ఫైనల్ చేసారు నీతూ మాస్టర్.

నెక్స్ట్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ దక్షి.. దేబ్జానీ, నరేష్ లని పిలవగా టాస్క్ లో దేబ్జానీ గెలిచింది. దేబ్జానీ మొదట షాలినిని నామినేట్ చేసింది. రోహిత్ తో కలిసి గేమ్ ఆడినందుకు తన పాయింట్స్ చెప్పింది. దేబ్జానీ మాట్లాడుతుంటే మధ్యలోనే అరవడం మొదలుపెట్టింది షాలిని. మధ్యలో రోహిత్ గొడవ పెట్టుకున్నాడు. తర్వాత రామ్ ప్రసాద్ ని హర్ట్ అయ్యేలాగా కామెడీ చేయొద్దు అని చెప్పి నామినేట్ చేసింది. దక్షి.. షాలిని నామినేషన్ ఓకే చేసింది. దీంతో షాలిని దాన్ని యాక్సెప్ట్ చేయలేక కొత్తగా వచ్చిన వాళ్ళు అని శివతో గొడవ పెట్టుకుంది మళ్ళీ. మధ్యలో నీతూ మాస్టర్ రావడంతో ఆమెపై కూడా ఇష్టమొచ్చినట్టు అరిచింది షాలిని. అసలు ఎవరు ఏం చెప్పినా వినే పొజిషన్ లో షాలిని లేదు. తన అరుపుల గురించి బయట జనాలు మాట్లాడుకున్నా, నాగార్జున చెప్పినా, కొత్తగా వచ్చిన వాళ్లంతా అదే చెప్పినా మారకుండా మళ్ళీ అరుస్తూనే అందరితో ఏమి లేకపోయినా గొడవ పెట్టుకునే ఉంది. ఈమెకు తోడు రోహిత్ మధ్యమధ్యలో వచ్చి అరుస్తూ ఉన్నాడు.

Also Read : Nayanthara : రాజకీయాల్లోకి నయనతార.. స్పందించిన భర్త విగ్నేష్ శివన్..

నెక్స్ట్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ రామకృష్ణ .. వంశీ, రామ్ ప్రసాద్ లని పిలవగా టాస్క్ లో వంశీ గెలిచాడు. వంశీ షాలిని పేరు చెప్పి ఆమె పాయింట్స్ చెప్పి నామినేట్ చేసాడు. షాలిని డిఫెండ్ చేసుకోడానికి మాట్లాడకుండా అరుస్తూనే ఉండటంతో బిగ్ బాస్ ఆపేసి ఇంకో నామినేషన్ కి వెళ్ళమన్నాడు. వంశీ ఇంకో నామినేషన్ ముకేశ్ పేరు చెప్పాడు. దీంతో రామకృష్ణ షాలినిని ఓకే చేయడంతో మళ్ళీ నామినేషన్ యాక్సెప్ట్ చేయలేక అతనిపై కూడా అరిచింది.

టాస్కుల్లో ఓడిపోయినా వాళ్లకు మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. మళ్ళీ అదే టాస్క్ పెట్టి ఈసారి టాస్కుల్లో ఓడిపోయినా వాళ్ళు కూడా నామినేట్ అవుతారు అని చెప్పాడు బిగ్ బాస్. త్రిగున్, వర్షిణి టాస్క్ అడగా త్రిగున్ గెలిచాడు. త్రిగున్ .. రోహిత్ చేసే పనులన్నీ, అతని గ్రూపిజం గురించి చెప్పి అతన్ని నామినేట్ చేసాడు. అమన్, రామ్ ప్రసాద్ లని పిలవగా టాస్క్ లో అమన్ గెలిచాడు. అమన్ వర్షిణిని నామినేట్ చేసాడు. వర్షిణి ని ఒక టాస్క్ లో హగ్ చేసుకొని చేసింది నాగార్జున తిట్టినా మళ్ళీ అమన్ అది తీసుకు రావడంతో వర్షిణి ఏడ్చింది. నెక్స్ట్ నరేష్, ఝాన్సీ లని పిలవగా టాస్క్ లో నరేష్ గెలిచాడు. నరేష్ .. రోహిత్ ని నామినేట్ చేసాడు. మధ్యలో చరణ్ టాపిక్ వచ్చింది. చరణ్ ఎలిమినేషన్ కి ఓట్ల ప్రక్రియ జరిగితే అందరూ షాలినికి వేస్తే అమన్ ఒక్కడే చరణ్ కి వేసిన సంగతి తెలిసిందే. రోహిత్ నరేష్ కంటే చరణ్ బెటర్ అని గత వారం నామినేషన్స్ లో అన్నాడు. అది గుర్తు చేసి నరేష్ మాట్లాడటంతో చరణ్ అంత బాగా ఆడితే నామినేషన్స్ లో నువ్వెందుకు చరణ్ కి ఓటు వేయలేదు అని అన్నాడు. దీంతో అందరూ అరిచారు. రోహిత్ షాలిని కోసం చరణ్ పేరు రాయలేదని అందరికి తెలిసిందే. దాన్ని కవర్ చేసుకోడానికి ట్రై చేసాడు. చరణ్ కి రీ ఎంట్రీ ఉంది. అందుకే షాలిని అని చెప్పాడు.

Also Read : Jailer 2 : జైలర్‌ 2 తెలుగు ప్రమోషన్స్ లేనట్టేనా.. నిరాశలో టాలీవుడ్ ప్రేక్షకులు..

నామినేషన్స్ ద్వారా వంశీ, అమన్, వర్షిణి, రోహిత్, షాలిని లు నామినేషన్ లో ఉన్నారు. టాస్క్ లో గెలవకపోవడంతో వర్షిణి ఆల్రెడీ నామినేషన్ లో ఉంది కాబట్టి ఝాన్సీ – రామ్ ప్రసాద్ లలో ఎవరు నామినేషన్స్ లో ఉండాలి అని కెప్టెన్ సుధీర్ ని అడిగారు బిగ్ బాస్. సుధీర్ రామ్ ప్రసాద్ పేరు చెప్పాడు. చివర్లో నరేష్, రామ్ ప్రసాద్ కలిసి సరదగా బురదలో ఆడారు. చివర్లో చరణ్ కి పాజిటివ్ గా మాట్లాడినందుకు షాలిని రోహిత్ తో గొడవ పెట్టుకుంది. మొత్తానికి ఇవాళ ఎపిసోడ్ అంతా వర్షింని అరుపులతోనే సాగింది. ఈమెకు ఎంతమంది చెప్పినా, ఎవరు చెప్పినా ఏమి లేకుండానే మారదా అనేలాగే అరుస్తూనే ఉంది. ఫైనల్ గా ఈవారం నామినేషన్స్ లో వంశీ, అమన్, వర్షిణి, రోహిత్, షాలిని, రామ్ ప్రసాద్ లు ఉన్నారు.