Bigg Boss OTT 3 : బిగ్‌బాస్ ఓటీటీ 3 సీజ‌న్ విజేగా స‌నా మ‌క్బుల్‌.. ట్రోఫీతో పాటు ప్రైజ్‌మ‌నీ ఎంతంటే..?

ప్రపంచ వ్యాప్తంగా బిగ్‌బాస్ షోకు ఎంతో క్రేజ్ ఉంది.

Sana Makbul

Bigg Boss : ప్రపంచ వ్యాప్తంగా బిగ్‌బాస్ షోకు ఎంతో క్రేజ్ ఉంది. ఇక మ‌న దేశంలోనూ వివిధ భాష‌ల్లో ప్ర‌సారం అవుతున్న ఈ షోకు మంచి స్పంద‌న వ‌స్తోంది. హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ సీజ‌న్ 3 విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. విజేత‌గా న‌టి స‌నా మక్బుల్ నిలిచింది. ర్యాప్ సింగ‌ర్ నేజీ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. విజేగా నిలిచిన స‌నా మ‌క్బుల్‌కు ట్రోఫీతో పాటు రూ.25 ల‌క్ష‌ల న‌గ‌దును ప్రైజ్‌మ‌నీగా అందుకుంది.

జూన్ 21న ఈ సీజ‌న్ ప్రారంభ‌మైంది. ఆగ‌స్టు 2న ఫైన‌ల్‌తో ముగిసింది. తొలి రెండు సీజ‌న్ల‌కు క‌ర‌ణ్ జోహార్‌, స‌ల్మాన్ ఖాన్‌లు హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించ‌గా మూడో సీజ‌న్‌కు న‌టుడు అనిల్ క‌పూర్‌గా వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించారు.

Wayanad landslides : లెఫ్టినెంట్ కల్నల్‌ హోదాలో వయనాడ్‌ సహాయక చర్యల్లో మోహన్‌లాల్‌..

విజేత‌గా నిలిచిన అనంత‌రం స‌నా మాట్లాడుతూ.. “నేను ఈ క్షణాన్ని నేజీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఈ ప్రయాణంలో నన్ను మాత్రమే నమ్మాడు. నాజీ.. మీరు దీన్ని (ట్రోఫీని) నాతో పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను.’ అని అంది.

ట్రెండింగ్ వార్తలు