Wayanad landslides : లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వయనాడ్ సహాయక చర్యల్లో మోహన్‌లాల్..
కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఎంతో మంది మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Actor Mohanlal reaches landslide hit Wayanad
Mohanlal : కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఎంతో మంది మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్ ముందుకు వచ్చారు. ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ కూడా అయిన మోహన్‌లాల్ శనివారం ఆర్మీ యూనిఫాం ధరించి వయనాడ్‌కు చేరుకున్నారు.
మెప్పాడిలోని ఆర్మీ క్యాంపు వద్దకు చేరుకున్న నటుడు, అధికారులతో కొద్దిసేపు చర్చించి.. కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Buddy : ‘బడ్డీ’ మూవీ రివ్యూ.. అమ్మాయి ప్రాణం టెడ్డీలోకి వస్తే..
ఆస్పత్రిలోచికిత్స పొందుతున్న బాధితులను మోహన్ లాల్ పరామర్శించనున్నారు. ఇప్పటికే ఆయన కేరళ సీఎం సహాయనిధికి రూ.25లక్షలు విరాళంగా అందించారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాలంటీర్లు, పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు, ప్రభుత్వ అధికారుల కృషిని ఆయన ప్రశంసించారు.
మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వందలాది మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.
RC17లోనూ అదే ఒరవడి? ఊరమాస్‌గా రామ్‌చరణ్ పాత్ర?
#WATCH | Actor Mohanlal who is a Lieutenant Colonel in the Territorial Army, reached the landslide-hit Mundakkai area in Wayanad.#Kerala pic.twitter.com/feEpYNZa5B
— ANI (@ANI) August 3, 2024