బిగ్ బాస్ 3: మెడల్‌ కోసం యుద్ధాలు చేస్తున్న ఇంటిసభ్యులు

  • Published By: veegamteam ,Published On : October 3, 2019 / 09:36 AM IST
బిగ్ బాస్ 3: మెడల్‌ కోసం యుద్ధాలు చేస్తున్న ఇంటిసభ్యులు

Updated On : October 3, 2019 / 9:36 AM IST

బిగ్‌బాస్‌ ఇంట్లో పదకొండో వారం టాస్క్ జోరుగా సాగుతుంది. ఈ వారంలో ఇంటిసభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ‘బ్యాటిల్‌ ఆఫ్‌ ద బెటాలియన్‌’. ఈ టాస్క్ లో ఇంటిసభ్యులు నువ్వానేనా అంటు యుద్ధాలు చేస్తున్నారు. ఎవరి వరకో ఎందుకు ఎప్పుడు మంచి స్నేహితులుగా ఉండే అలీ, శ్రీముఖిల మధ్య దూరం పెరుగుతోంది.  రాహుల్‌, వరుణ్‌, పునర్నవి, వితికలు కలిసి అలీ కూడా వారి టీం లో కలిసిపోయాడు. 

ఇక నిన్న బిగ్ బాస్ ఇచ్చిన ‘కుళాయి కొట్లాట’ గేమ్‌లో పునర్నవి సంచాలకులుగా వ్యవహరించింది. ఈ టాస్క్‌లో గ్లాస్‌ కంటెయినర్‌లో నీళ్లు నింపి స్మైలీ బాల్‌ను పైకి వచ్చేలా చేయాలి. అయితే నామినేట్‌ అయిన సభ్యులను బిగ్ బాస్ ఈ గేమ్ కి అనర్హులుగా ప్రకటించారు. వారు నచ్చనివారిని అడ్డుకోవచ్చు, నచ్చినవారికి సహాయం చేయవచ్చు అని తెలిపారు. మొత్తానికి ఈ టాస్క్ లో వితికా విజయం సాధించింది. 

ఇక ఈ లెవల్‌లో విజయం సాధించిన వితిక నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించటంతో శ్రీముఖి, అలీ రెజా, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు రెండవ లెవల్‌ ఆడబోతున్నారు. ఈ టాస్క్‌లో వారి శరీరాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ.. ఫ్రేములలో నిలబడగా వారి తలపై ఒక చెక్కను పెడతారు. అది కిందపడకుండా వారు జాగ్రత్తపడాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు చూపించిన ప్రొమోలో అయితే అలీ చెక్కను పడేసినట్టు చూపించారు. మరి అలీ దాన్ని బ్యాలెన్స్ చేయలేక పడేశాడా.. లేక శివజ్యోతి కోసం పడేశాడ అన్నది తెలియాల్సి ఉంది. చివరగా ఈ టాస్క్‌లో ఎవరు గెలుస్తారో..  మెడల్‌ ను ఎవరు గెలుచుకుంటారో చూడాలి.