Bigg Boss 8 : బిగ్ బాస్‌లో కమ్యూనిటీ చర్చ.. మెహబూబ్, నబిల్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు, ఆడియన్స్.. వాళ్ళని పంపేయండి అంటూ..

నిన్నటి ఎపిసోడ్ లో మెహబూబ్, నబిల్ కూర్చొని నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.

Bigg Boss Season 8 Mehaboob and Nabil gets Trolls in Social Media

Bigg Boss 8 : సాధారణంగా బిగ్ బాస్ రియాలిటీ షోలో మతం, కులం.. ఇలాంటి ప్రస్తావన ఉండదు. కేవలం వాళ్ళ వర్క్, వాళ్ళ ఫ్యామిలీల గురించే మాట్లాడతారు. అయితే మొదటిసారి బిగ్ బాస్ లో అది కూడా మన తెలుగు బిగ్ బాస్ లో కమ్యూనిటీ గురించి మాట్లాడుకోవడంతో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. వీడియోతో సహా వైరల్ అవుతుంది.

Also Read : Bigg Boss Nominations : ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే..?

నిన్నటి ఎపిసోడ్ లో మెహబూబ్, నబిల్ కూర్చొని నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో మెహబూబ్ మాట్లాడుతూ..మనకు దారుణమైన ప్లస్ ఏంటంటే మనకు మన కమ్యూనిటీ ఉంది. ఆ ఓట్లు దారుణంగా పడతాయి. కానీ ఒకటి మన ఇద్దరం చూసుకోవాలి. నామినేషన్స్ లో ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలి. ఇద్దరూ ఉండకూడదు. అప్పుడే ఓట్లు చీలకుండా అంటాయి అని అన్నాడు. దీనికి నబిల్ కూడా అవును అంటూ తల ఊపాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఇది ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేయకపోయినా ఓటీటీ లైవ్ లో రావడంతో ఇప్పటికే వీడియో కట్ చేసి వైరల్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటారని ఎవరూ ఊహించలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరిపై విమర్శలు దారుణంగా వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళని రెడ్ కార్డు ఇచ్చి మరీ బయటకి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని బిగ్ బాస్, నాగార్జునని కోరుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఇద్దర్ని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్ కి ఎందుకు తీసుకొచ్చారు, అలా మాట్లాడకూడదు అని మినిమమ్ సెన్స్ లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనిపై బిగ్ బాస్ కానీ, నాగార్జున కాని ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి. వెంటనే స్పందించకపోతే బిగ్ బాస్ కి పెద్ద డ్యామేజీ జరిగే అవకాశం ఉంది.