Bigg Boss 10 Nominations : మళ్ళీ రెచ్చిపోయిన సృష్టి.. ఏడ్చేసిన దేబ్జానీ.. ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే.. బిగ్ బాస్ 10 ‘డే 16’ ఫుల్ ఎపిసోడ్..
నిన్న సగం నామినేషన్స్ అయ్యాయి. నిన్న అంతా వేరే వాళ్ళ నామినేషన్ మధ్యలో సుధీర్ - సృష్టి గొడవ హైలెట్ అయింది. (Bigg Boss 10 Nominations)
- Saketh U
- Updated on- September 22, 2026 / 10:58 PM IST
Bigg Boss 10 Nominations
Bigg Boss 10 Nominations : నిన్న సగం నామినేషన్స్ అయ్యాయి. నిన్న అంతా వేరే వాళ్ళ నామినేషన్ మధ్యలో సుధీర్ – సృష్టి గొడవ హైలెట్ అయింది. ఇక నేడు ఆ ఇష్యూ గురించి వర్షిణి సుధీర్ మాట్లాడుకున్నారు. వర్షిణి సుధీర్ ని తిట్టింది. రామ్ ప్రసాద్ నరేష్ ని సృష్టిని నామినేషన్ చేయమన్నాడు సుధీర్ ని పిచ్చ తిట్లు తిట్టినందుకు. రామ్ ప్రసాద్ అందరికి చెప్పాడు నామినేషన్ డబల్ ఛాన్స్ వస్తే నరేష్ కి ఇమ్మన్నాడు. సుధీర్ రామ్ ప్రసాద్ తో కూడా మాట్లాడాడు. రామ్ ప్రసాద్.. సృష్టి నాకు నచ్చలేదు. అసలు నాగార్జున కనపడట్లేదు అని చెప్పింది కాబట్టే అలా చేసింది అన్నాడు సుధీర్ తో.
సృష్టి తన అగ్నిపరీక్ష టీమ్ తో కూర్చొని మాట్లాడుకుంది. ఝాన్సీ సుధీర్ కోసం మాట్లాడుతుంది అని సృష్టి చెప్తే రోహిత్ ఝాన్సీ ని చిడతలు తెచ్చుకొని వాళ్ళ అన్నలకు భజనలు చేయమంటూ అన్నాడు. సృష్టి వంశీ, త్రిగుణ తో డిస్కషన్ చేసింది. ఇక రోహిత్ త్రిగున్ శకుని అంటూ అందరితో మళ్ళీ నెగిటివ్ గా చెప్పడం మొదలు పెట్టాడు.
అనంతరం నిన్న ఆగిపోయిన నామినేషన్స్ మొదలయ్యాయి. నిన్నటి ఎన్వలప్ గేమ్ తోనే నడిచింది. మొదట ముకేశ్ కి ఛాన్స్ వచ్చింది. ముకేశ్.. చరణ్ ని నామినేట్ చేసాడు. నువ్వు రీ ఎంట్రీ ఇచ్చాక మళ్ళీ అలాగే సైలెంట్ గా ఉంటున్నావు, సీరియస్ గా ఆడట్లేదు అని చెప్పాడు. ఇక చరణ్ నీకు అసలు స్టార్ ప్లేయర్ డిజర్వ్ కాదు అని అన్నాడు. అలాగే కెప్టెన్సీ టాస్క్ లో రాసే టాస్క్ లో నువ్వులు తప్పు చేసావు అన్నాడు. చరణ్ గేమ్ లో లేకుండా అప్పుడు హౌస్ లో లేకుండానే ఎలా మాట్లాడుతున్నావు అని తిట్టాడు ముకేశ్. వంశీ కూడా ముకేశ్ తో గొడవ పెట్టాడు. మధ్యలో షాలిని – వర్షిణి గొడవ పడ్డారు.
Also See : Tejaswini Gowda : గౌనులో సీరియల్ నటి తేజస్విని గౌడ క్యూట్ ఫొటోలు..
తర్వాత షాలినికి ఛాన్స్ వచ్చింది. షాలిని అనుకున్నట్టే వర్షిణిని నామినేషన్ చేసింది. వెనక ఉండి ఇద్దర్ని నడిపిస్తున్నందుకు, గొడవలు పెడుతున్నందుకు అని చెప్పింది. దీంతో మళ్ళీ వర్షిణి – షాలిని మధ్య గొడవ అయింది. తన రెండో నామినేషన్ సృష్టి కి ఛాన్స్ ఊహించినట్టే సృష్టి.. సుధీర్ ని నామినేట్ చేసి నిన్నటి గొడవ మళ్ళీ తీసుకొచ్చి సుధీర్ పై అరిచింది. సుధీర్ ఇవాళ మాత్రం కూల్ గా ఉన్నాడు. నామినేషన్స్ ముగియడంతో ఈ వారం నామినేషన్స్ లో.. వంశీ, సుధీర్, షాలిని, అమన్, ఝాన్సీ, త్రిగున్, చరణ్, వర్షిణిలు ఉన్నారు.
నామినేషన్స్ అనంతరం సుధీర్ వర్షిణి దగ్గర ఏడ్చాడు. సృష్టి తాను కనపడటానికి సుధీర్ పై అరిసినందుకు. వర్షిణి, సుధీర్ త్రిగున్ ని తిట్టారు. అనంతరం బిగ్ బాస్ అందరితో మాట్లాడాడు టెంప్టేషన్, టెన్షన్స్ గురించి.
బిగ్ బాస్ ఈ టెంప్టేషన్ – టెన్షన్ టాస్క్ గురించి చెప్తూ.. గార్డెన్, లివింగ్ ఏరియాలలో బజర్లు ఉంటాయి. సైరన్ వినగానే రెండు బజర్లులో ఎవరో ఒకరు ఏదో ఒకటి ప్రెస్ చేయాలి. రెండు ఎవరు ముందు ప్రెస్ చేస్తే వాళ్లకు టెంప్టేషన్స్ కోసం పోటీ జరుగుతుంది. అందులో గెలిచిన వాళ్ళు నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ డైరెక్ట్ గా అవుతారు. అలాగే ఒక టెంప్టేషన్ సాధిస్తారు. కానీ ఇంకొకరికి టెన్షన్ ఇవ్వాలి అని చెప్పారు.
బజర్ లో ముకేశ్, రోహిత్ గెలిచారు. ముకేశ్, రోహిత్ లకు టాస్క్ ఇచ్చారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ లాగా బాక్స్ లను తోయలి. ఒకే బాక్స్ ని ఇద్దరు రెండు వైపులా తోయలి. ఎవరు ఇంకొకరిని బయటకి తోసేస్తారో వాళ్ళు గెలిచినట్టు. అమన్ సంచాలక్ గా ఉన్నాడు ఈ టాస్క్ కి. ఈ టాస్క్ లో ముకేశ్ గెలిచాడు. దీంతో ముకేశ్ నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కి డైరెక్ట్ కంటెండర్ అయ్యాడు. అలాగే టెంప్టేషన్ గెలుచుకున్నాడు.
Also Read : Bigg Boss Trigun : బిగ్ బాస్ సీజన్ 10 త్రిగున్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా? భార్యతో క్యూట్ ఫొటోలు..
ముకేశ్ కి బిగ్ బాస్ ఫోన్ చేసి.. ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడారు. కుశల ప్రశ్నలు అడిగారు. మీ నాన్నను మిస్ అవుతున్నారా అని అడిగాడు అవును అని తన తండ్రితో ఉన్న అనుబంధం చెప్పారు ముకేశ్. మీ నాన్నతో మీరు దిగిన ఫోటోని మీకు టెంప్టేషన్బ్ గా ఇస్తాను కానీ అది రావాలంటే వేరే వాళ్లకు టెన్షన్ ఇవ్వాలి. దేబ్జానీకి అమ్మానాన్న రాసిన ఉత్తరాన్ని ఇవ్వకూడదు. లేదా వర్షిణి అమ్మ, అక్క కలిసి ఉన్న ఫోటో ఇవ్వకూడదు. ఈ రెండిటిలో ఎవరికి టెన్షన్ ఇస్తారు అని అడిగితే దేబ్జానీకి అని చెప్పారు. అలాగే టెన్షన్ ఇస్తే వాళ్ళ గిఫ్ట్ ని నాశనం చేయాలి, వాళ్లకు కెప్టెన్సీ కంటెండర్ అవకాశం రాదు అని చెప్పాడు.
దీంతో ముకేశ్ బయటకు వచ్చి దేబ్జానీ చెప్పాడు ఈ విషయం అంతా. అదొక్కటే చెప్పాడు దేబ్జానీ అడిగినా వర్షిణి అప్షన్ చెప్పలేదు. కానీ బిగ్ బాస్ అందరికి వర్షిణి విషయం కూడా చెప్పాడు. అనంతరం దేబ్జానికి ఇంటి నుంచి పేరెంట్స్ రాసిన లెటర్ ని నాశనం చేయమన్నారు బిగ్ బాస్. ముకేశ్ ఆ లెటర్ ని నాశనం చేసి దేబ్జానీ ఏడవడంతో సారీ చెప్పాడు ముకేశ్. దేబ్జానీ వాష్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చింది. ఇక రేపు కెప్టెన్సీ టాస్క్ జరగబోతుంది.
