Bigg Boss 10 Today Promo : గెలిచిన రోహిత్.. చైత్రా రాయ్, షాలినీ మాటల యుద్ధం..
Bigg Boss 10 Day 4 Today Promo 1 : నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది.
Bigg Boss Telugu 10 Day 4 Promo 1 Chaitra Rai Shalini arguments
Bigg Boss 10 Day 4 Today Promo 1 : ప్రస్తుతం బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లు అంతా హౌస్ మేట్స్ హోదాని సంపాదించుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో వారు హౌస్‌మేట్స్‌గా మారేందుకు బిగ్‌బాస్ టాస్కులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో నేటి ఎపిసోడ్ ప్రొమో వచ్చేసింది. లేటెస్టుగా ఇద్దరు హౌస్ మేట్స్‌గా మారే అవకాశాన్ని కల్పించేందుకు బిగ్‌బాస్ ఓ టాస్క్ పెట్టారు.
బ్లూ, రెడ్ టీమ్‌లోంచి ఇద్దరు చొప్పున టాస్క్‌లో పాల్గొంటారు. ఈ ఇద్దరు కలిసి తమ టీమ్‌లోని ఓ మెంబర్ని డేంజర్ జోన్లోకి నెట్టాల్సి ఉంటుంది. రెడ్ టీమ్ నుంచి రోహిత్, వంశీ రాగా.. బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్, ముఖేష్ వచ్చారు. రెడ్టీమ్లోని ఇద్దరు కలిసి చైత్రా రాయ్ పేరుని పేర్చగా, బ్లూ టీమ్‌లోని వారు కృష్ణుడు పేరుని పేర్చుతారు.
Read Also – Sowmya Rao : 80s లుక్స్‌లో అదిరిపోయిన యాంకరమ్మ.. సౌమ్య ఫోటోలు వైరల్..
బ్లూ టీమ్ ముందుగా టాస్క్‌ను ఫినిష్ చేసినప్పటికి కూడా స్పెల్లింగ్ తప్పుగా పెట్టారు. దీంతో రెడ్ టీమ్ విజేతగా నిలిచినట్లుగా బిగ్‌బాస్ అనౌన్స్ చేస్తారు. రోహిత్, వంశీలు హౌస్మేట్స్ అయ్యారు. ఇక అంతే మ్యూజిక్ ప్లీజ్ షాలినీ అంటుంది. ఇది విన్న చైత్రా రాయ్ హర్ట్ అవుతుంది.
మేం మీ ఓటమి కోసం పాట అడగలేదు, మా సెలెబ్రేషన్స్ కోసం పాట అడిగాం, మీరు నా మీద బ్లేమ్ వేయాలనుకుంటే వేసుకోండి అని షాలిని అంది. నువ్వు నన్ను గెలకొద్దు, సింపతీ గేమ్ ఆడొద్దు అని చైత్రా రాయ్ అంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచినట్లుగా కనిపిస్తోంది. ఇంకా ఏం జరిగింది తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
