Bigg Boss Telugu 10 Today Promo : నాకు ముకేశ్ అంటే ఇష్టం సార్.. కానీ నా దగ్గరికి రావడం లేదు.. అటు, ఇటు పులిహోర.. బిగ్‌బాస్ ఇంట్లో లవ్ ట్రాక్ మొదలు కానుందా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో (Bigg Boss Telugu 10 Today Promo) తొలి ఆదివారానికి సంబంధించిన ప్రొమో వచ్చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 13, 2026 / 01:16 PM IST
Bigg Boss Telugu 10 Day 7 Today Promo Debjani open up her love on mukesh
Bigg Boss Telugu 10 Today Promo : బిగ్‌బాస్ ఇంట్లో లవ్ ట్రాక్స్ అనేది కామన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. కొంత మంది నిజంగా ప్రేమలో పడితే, మరికొంత మంది మాత్రం కేవలం పుటేజ్ కోసం ఇలా చేస్తుంటారు. ఇక ఇటీవల మొదలైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఇప్పటి వరకు అయితే అలాంటి లవ్ ట్రాక్ ఏదీ కనిపించలేదు. గానీ.. ఆదివారం (సెప్టెంబర్ 13) ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను చూస్తుంటే.. త్వరలోనే ఓ కొత్త లవ్ ట్రాక్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హృదయానికి దగ్గరైంది ఎవరు? దూరం చేస్తున్నది ఎవరు ? అనే ప్రశ్నకు కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా సమాధానాలు చెబుతున్న సంగతి తెలిసిందే. శనివారం కొందరు చెప్పగా.. ఇక మిగిలిన వారు ఆదివారం చెప్పారు. రామ్‌ప్రసాద్‌ను అడుగగా.. దేబ్జానీ హృదయానికి దగ్గరైందని చెబుతాడు. మీ కామెడీ అంటే ఇష్టం రామ్‌ప్రసాద్ అని నాతో చెప్పింది.. కానీ ఆ తదుపరి రోజే కోపంగా నేను నీతో మాట్లాడను అని షాలీని చెప్పినట్లు రామ్ ప్రసాద్ తెలిపాడు.
ఇలా ఒక్కొక్కరుగా ముకేశ్ సైతం చెప్పాడు. అయితే.. అప్పుడు నాగార్జున.. ముకేశ్ నీ గురించి ఒకటి చెప్పాలి? నీ కళ్లు బాగుంటాయి అని చెబుతాడు. మీరు చెబుతుంటే బాగుంది సార్, నమ్మాలని ఉందని ముకేశ్ సమాధానం ఇస్తాడు. అంటే దేబ్జానీ చెప్పినప్పుడు నమ్మలేదా? అని నాగ్ సెటైర్ వేస్తాడు.
వెంటనే దేబ్జానీ మాట్లాడుతూ.. నాకు నిజంగానే అనిపించింది కాబట్టే చెప్పా అని అంటుంది. ఆ వెంటనే ముకేశ్ మాట్లాడుతూ.. నీ కళ్లు కూడా బాగానే ఉంటాయ్ అని దేబ్జానీకి చెబుతాడు. నాకు ముకేశ్ అంటే చాలా ఇష్టం సార్.. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చెప్పలేకపోతున్నా సార్.. ఇటు సైడ్ పులిహోర చేస్తున్నాడు.. అటు సైడ్ పులిహోర చేస్తున్నాడు.. కానీ నా దగ్గరకు మాత్రం రావడం లేదు సార్ అని దేబ్జానీ అనడంతో అందరూ నవ్వేస్తారు. దీనిపై ముకేశ్ ఏం సమాధానం చెప్పాడు అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయక తప్పదు.
