Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. వర్షిణి – ముకేశ్ ని కలిపిన వర్షిణి తల్లి.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
నరేష్, అమన్, వంశీ, రామకృష్ణ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. (Bigg Boss New Captain)
- Saketh U
- Published on- November 14, 2026 / 10:50 PM IST
Bigg Boss New Captain
Bigg Boss New Captain : నిన్నటితో ఫ్యామిలీ వీక్ అయిపొయింది. నేడు వీకెండ్ కావడంతో నాగార్జున డాన్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. మొదట శుక్రవారం ఎపిసోడ్ కొంత చూపించారు. కెప్టెన్ టాస్క్ లో ముకేశ్ – వర్షిణి గొడవ పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఇష్యూ గురించి ఇద్దరూ కూర్చొని మాట్లాడారు. కెప్టెన్సీ టాస్క్ సెకండ్ లెవల్ కి నలుగురు వచ్చిన సంగతి తెలిసిందే. CAPTAIN అనే లెటర్స్ ఫిల్ అయ్యేలా ఆ నలుగురిలో ఎవరు కెప్టెన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక్కో లెటర్ వేసి కారణం చెప్పాలి హౌస్ మెంబర్స్. ఎవరిది ఫుల్ కెప్టెన్ మొదట అవుతుందో వాళ్ళు కెప్టెన్ అవుతారు. నరేష్, అమన్, వంశీ, రామకృష్ణ కెప్టెన్సీ రేసులో ఉన్నారు.
ముకేశ్ – నరేష్ కి సపోర్ట్ చేసాడు. శివ – అమన్ కి, రామ్ ప్రసాద్ – నరేష్ కి, వర్షిణి – అమన్ కి, నీతూ – అమన్ కి, దేబ్జానీ – నరేష్ కి, శ్వేతా – అమన్ కి, సుధీర్ – నరేష్ కి, త్రిగున్ – నరేష్ కి సపోర్ట్ చేసారు. నరేష్ కి ఎక్కువ లెటర్స్ రావడంతో మిగిలిన లెటర్స్ తననే పెట్టుకోమన్నాడు బిగ్ బాస్. దీంతో ఈ వారం కొత్త కెప్టెన్ గా నరేష్ ఎంపికయ్యాడు. వంశీ తన కెప్టెన్ స్టిక్కర్ నరేష్ కి ఇచ్చి తనని భుజాల మీద ఎత్తుకొని తిప్పాడు. నరేష్ కి కెప్టెన్ మెడల్ ఇచ్చారు.
అనంతరం మరోసారి త్రిగున్ గురించి రామ్ ప్రసాద్ దగ్గర నెగిటివ్ గా మాట్లాడాడు శివ. త్రిగున్ తో రామ్ ప్రసాద్, దేబ్జానీ కాసేపు కామెడీ చేసారు. కొత్త కెప్టెన్ కి ఇచ్చే గోల్డ్ కాయిన్స్ నరేష్ రామ్ ప్రసాద్, వంశీ కి ఇచ్చాడు. అనంతరం నాగార్జున హౌస్ కంటెస్టెంట్స్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదట నరేష్ కి అభినందనలు తెలిపారు నాగార్జున కెప్టెన్ అయినందుకు.
Also See : Vaishnavi Chaitanya : మోడ్రన్ డ్రెస్ లో వైష్ణవి చైతన్య వయ్యారాలు.. షూట్ గ్యాప్ లో సరదాగా..
ఐ యాం సారి, ఐ యాం నాట్ సారి అనే టాస్క్ పెట్టారు. పది వారాల జర్నీలో మీరు బాగా హర్ట్ అయిన సంఘటన, హర్ట్ చేసిన పర్సన్ గురించి చెప్తే వాళ్ళు దానికి సమాధానం చెప్పి ఐ యాం సారి, ఐ యాం నాట్ సారి లలో ఏదో ఒకటి చెప్పాలి.
ఫస్ట్ వర్షిణి – త్రిగున్ పేరు చెప్పింది. నామినేషన్స్ లో త్రిగున్ మాట్లాడినందుకు ఏడ్చి దాని వల్ల ఎఫెక్ట్ అయ్యాను అని చెప్పింది. దాంతో వర్షిణికి ఐ యాం సారి చెప్పి తన వర్షన్ చెప్పాడు త్రిగున్. శ్వేతా – రామ్ ప్రసాద్ పేరు చెప్పి కెప్టెన్సీ టాస్క్ లో నన్ను తీసేసారు అని హర్ట్ అయ్యాను అని చెప్పింది. అయితే నాగార్జున వీడియో చూపించాడు అందులో శ్వేతాదే తప్పు ఉంది. దాంతో ఐ యాం నాట్ సారి అని చెప్పాడు రామ్ ప్రసాద్. అదే టాస్క్ లో ముకేశ్ – వర్షిణి గొడవ అయిన రీజన్ కూడా చూపించి వర్షిణి దే కరెక్ట్ అని చెప్పారు నాగార్జున. నీతూ – వంశీ పేరు చెప్పింది. నామినేషన్స్ లో తిట్టిన మాటలకు హర్ట్ అయ్యాను అని చెప్పింది. వంశీ ఐ యాం సారి చెప్పాడు. నీతూ తనని తాను కొట్టుకున్న వీడియో చూపించి అలా చేయొద్దు అన్నారు నాగార్జున.
ముకేశ్ – నాకు అలాంటి హర్ట్ అయిన సంఘటనలు లేవు అని చెప్పాడు. శివ – ముకేశ్ పేరు చెప్పి పర్సనల్ లైఫ్ గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకు అన్నాడు. ఐ యాం సారి చెప్పి తన వర్షన్ చెప్పాడు ముకేశ్. నరేష్ – త్రిగున్ పేరు చెప్పి గతంలో కెప్టెన్సీ టాస్క్ లో తనవల్ల నాకు లాస్ అయిందని హర్ట్ అయ్యాను అన్నాడు. ఐ యాం సారి చెప్పాడు త్రిగుణ. అమన్ – త్రిగున్ పేరు చెప్పి గతంలో బూతు మాట్లాడుతూ ఆపేసిన దానికి హర్ట్ అయినట్టు చెప్పాడు. అప్పుడు అమన్ కూడా బూతులు మాట్లాడాడు. దాన్ని ఇంకా అగుర్తుంచుకున్నావా అని షాక్ అయి త్రిగుణ ఐ యాం సారి అని చెప్పాడు.
సుధీర్ – ముకేశ్ పేరు చెప్పి నామినేషన్స్ లో తనని, తన కాలి నొప్పిని ఫేక్ అని చెప్పినందుకు హర్ట్ అయినట్టు తెలిపాడు. కానీ ముకేశ్ ఐ యాం నాట్ సారి తన కాలి నొప్పి ఫేక్ అని చెప్పాడు మళ్ళీ. కానీ అది నిజం అని నాగార్జున చెప్పారు. వంశీ – నీతూ పేరు చెప్పి నామినేషన్స్ లో ఇష్టమొచ్చినట్టు మాట్లడిండానికి హర్ట్ అయినట్టు తెలిపాడు. నీతూ ఐ యాం సారి చెప్పింది. రామ్ ప్రసాద్ – వర్షిణి పేరు చెప్పాడు. మళ్ళీ అదే నామినేషన్స్ కార్డు పట్టుకొని చెప్పాడు. అతను ఫీల్ అయినందుకు ఐ యాం సారి అని చెప్పింది. గత రెండు వారాలుగా అదే కార్డు తో గేమ్ ఆడుతున్న రామ్ ప్రసాద్ దగ్గర ఆ కార్డు తీసుకోమని చింపించేసాడు నాగ్. అందరూ అన్నా నువ్వు కన్నింగ్ కాదు చాణుక్యుడు అని రామ్ ప్రసాద్ కి చెప్పాడు నాగార్జున.
దేబ్జానీ – రామ్ ప్రసాద్ పేరు చెప్పి అంతా హెల్ప్ చేస్తాడు కానీ కెప్టెన్సీ లో వంశీకి ఓటు వేసినందుకు హర్ట్ అయ్యాను అని తెలిపింది. రామ్ ప్రసాద్ ఐ యాం సారి చెప్పాడు. దేబ్జానీకి ఓట్ వేస్తే టై అయ్యేది, అందుకే వంశీ కి వేసాను అని తెలిపాడు. త్రిగున్ – వర్షిణి పేరు చెప్పి ముకేశ్ తో కలిసి తన గురించి నెగిటివ్ గా చేసింనందుకు, తనకు సపోర్ట్ ఇవ్వనందుకు హర్ట్ అయినట్టు తెలిపాడు. ఐ యాం సారి చెప్పింది వర్షిణి. రామకృష్ణ – నరేష్ పేరు చెప్పి ఫ్యామిలీ గేమ్ లో తన బదులు ముకేశ్ విన్ అయ్యాడని చెప్పినందుకు హర్ట్ అయ్యాడు. ఐ యాం సారి చెప్పాడు నరేష్.
అనంతరం జీరో అని రాసి ఉన్న మెడల్స్ తెచ్చారు. హౌస్ లో జీరో గేమర్ ఎవరో చెప్పాలి అందరూ. వాళ్ళు ఏం ఆడట్లేదు, జీరోగానే ఉన్నారు అనేది ఎవరికీ సెట్ అవుతుందో వాళ్ళ మెడలో ఈ జీరో ట్యాగ్ వేసి కారణాలు చెప్పాలి అని అన్నారు నాగార్జున. రామ్ ప్రసాద్ – వర్షిణికి జీరో మెడల్ వేసాడు. వంశీ – వర్షిణికి, శ్వేతా – వర్షిణికి, అమన్ – సుధీర్ కి, ముకేశ్ – సుధీర్ కి, రామకృష్ణ – శ్వేతాకి, శివ – త్రిగున్ కి నీతూ – త్రిగున్ కి వేశారు. గేమ్ బాగా ఆడినందుకు, పవర్ ఫుల్ గా రూడ్ గా ఆడినందుకు అలా ఆడకూడదు, ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు అందుకే జీరో అని నీతూ మాస్టర్ చెప్పడం గమనార్హం. మాట్లాడటం గురించి త్రిగున్ తానే మాట్లాడుతుంది, తను ఈ రీజన్ చెప్తుంది అని కౌంటర్ ఇచ్చాడు. దేబ్జానీ – సుధీర్ కి, నరేష్ – నీతూకి, వర్షిణి – శివకి, సుధీర్ – రామకృష్ణకి, త్రిగున్ – శివకి జీరో మెడల్స్ ఇచ్చారు.
అయితే వర్షిణి – సుధీర్ టై వచ్చాయి. దాంతో వాళ్ళిద్దరి కోసం హౌస్ కంటెస్టెంట్స్ ఓట్లు తీసుకున్నారు. ఎక్కువ ఓట్లు వర్షిణి కి పడ్డాయి. దాంతో వర్షిణికి రెడ్ పిల్, బ్లూ పిల్ అని రెండు ఇచ్చి ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నారు. దాంట్లో బ్లూ పిల్ తీసుకుంది. దాంట్లో నో కెప్టెన్ ఈ సీజన్ లో అనే పనిష్మెంట్ ఉంది. దాంతో వర్షిణి ఇకపై ఈ సీజన్ లో బిగ్ బాస్ కెప్టెన్ అవ్వడానికి ఛాన్స్ లేదు అని చెప్పారు నాగార్జున. అనంతరం పుష్పక విమానం వెబ్ సిరీస్ టీమ్ ప్రమోషన్స్ కి వచ్చారు.
అందరి ఫ్యామిలీస్ వచ్చాయి కానీ వర్షిణి, రామకృష్ణ ఫ్యామిలీలు రాలేదు. అందుకే ఒక అవకాశం ఇస్తున్నా అని చెప్పారు నాగార్జున. అయితే ఒక్కరికే ఛాన్స్, ఎవరి ఫ్యామిలీ రావాలో హౌస్ కంటెస్టెంట్స్ డిసైడ్ చేయాలి. రీజన్ చెప్పి వాళ్లకు ఓటు వేయాలి. ఓ టాస్క్ పెట్టారు. వర్షిణి వాళ్ళ అమ్మ, రామకృష్ణ వాళ్ళ అమ్మ వచ్చిహౌస్ బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎమోషనల్ అయ్యారు. వర్షిణి, ఆర్కే కూడా ఏడ్చారు.
Also Read : Giri Babu : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత..
ఈ టాస్క్ లో దేబ్జానీ – వర్షిణికి ఓటు వేసింది. అమన్ – ఆర్కేకి , శ్వేతా – ఆర్కేకి, శివ – ఆర్కేకి, నీతూ – వర్షిణికి, వంశీ – వర్షిణికి, రామ్ ప్రసాద్ – ఆర్కేకి, సుధీర్ – వర్షిణికి, త్రిగుణ – వర్షిణికి, నరేష్ – వర్షిణికి, ముకేశ్ – వర్షిణికి ఓట్లు వేశారు. వర్షిణికి 7 ఓట్లు, రామకృష్ణకు నాలుగు ఓట్లు పడ్డాయి. దీంతో వర్షిణి అమ్మ ఇంట్లోకి వస్తారని, రామకృష్ణ మాత్రం బయట నుంచి మాట్లాడతారు వీడియోలో అని చెప్పారు నాగార్జున. దాంతో రామకృష్ణ వాళ్ళ అమ్మ కూడా ఫుల్ గా ఏడ్చారు. రామకృష్ణ – వాళ్ళ అమ్మ మాట్లాడుకున్నారు. ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు.
అనంతరం వర్షిణి తల్లి హౌస్ లోకి వచ్చింది. అందర్నీ పలకరించింది. వర్షిణి హగ్ చేసుకొని ఎమోషనల్ అయింది. వర్షిణి, అమ్మ ఇద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారు. ముకేశ్, త్రిగున్ కూడా కూర్చొని వాళ్ళ అమ్మతో మాట్లాడారు. ముకేశ్ తో చివరి వరకు మా అమ్మాయి చెయ్యి పట్టుకొని ఆడు అంది వాళ్ళ అమ్మ. అందరి ఫ్యామిలీస్ కి వేసినట్టే చివర్లో ఓ అమ్మ సాంగ్ వేశారు. అందరూ డ్యాన్స్ వేశారు. వర్షిణి అమ్మ వెళ్ళిపోయింది. దీంతో ఎపిసోడ్ ముగించారు. ఇవాళ ఎలిమినేషన్స్ చేయలేదు. రేపు ఒక ఎలిమినేషన్ ఉండొచ్చు అని తెలుస్తుంది.
