Bigg Boss Telugu Nominations : బిగ్ బాస్ 10 తెలుగు.. ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు?

Bigg Boss Telugu Nominations: మొదటి వారమే ఇద్దర్ని ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.

  • Updated on- September 15, 2026 / 11:41 AM IST

Bigg Boss Telugu 10 This Week Nominations List

Bigg Boss Telugu 10 Nominations : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదటి వారం పూర్తి చేసుకొని రెండవ వారంలోకి అడుగు పెట్టింది. మొదటి వారమే ఇద్దర్ని ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక నిన్న సోమవారం నామినేషన్స్ పర్వం ముగిసింది. రెండవ వారంలో నామినేషన్స్ కి కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇద్దరిద్దర్ని పిలిచి ఆ టాస్క్ ఆడించాడు. అందులో గెలిచినా వాళ్ళు అక్కడ ఉన్న గోల్డ్, సిల్వర్ గొడ్డలిలో ఏదో ఒకటి తీసుకోవాలి. సిల్వర్ గొడ్డలి అందుకుంటే ఒకర్ని, గోల్డ్ గొడ్డలి అందుకుంటే ఇద్దర్ని నామినేట్ చేయొచ్చు. అలాగే అలాగే టాస్క్ లో ఓడిపోయినవాళ్లు కూడా నామినేట్ అవుతారు అని చెప్పాడు.

Also Read – Bigg Boss Nominations : నామినేషన్స్ ఫైర్.. కొట్టుకోడానికి రెడీ అయిన షాలిని – వర్షిణి.. కట్టప్పగా మారిన సుధీర్.. బిగ్ బాస్ 10 ‘డే 8’ ఫుల్ ఎపిసోడ్..

  • సుధీర్.. త్రిగున్, షాలినిని నామినేట్ చేసాడు.
  • దేబ్జానీ.. త్రిగున్ ని నామినేట్ చేసింది.
  • రోహిత్.. త్రిగున్, ఝాన్సీ ని నామినేట్ చేసాడు.
  • నరేష్.. షాలిని ని నామినేట్ చేసాడు.
  • త్రిగున్.. సుధీర్, రోహిత్ లని నామినేట్ చేసాడు.
  • అమన్.. రామ్ ప్రసాద్, ఝాన్సీ లని నామినేట్ చేసాడు.
  • వంశీ.. దేబ్జానీ, ముకేశ్ లని నామినేట్ చేసాడు.

దీంతో ఈ వారం షాలిని, త్రిగున్, రోహిత్, ఝాన్సీ, ముకేశ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, సుధీర్ లు ఉండగా కృష్ణుడు, సృష్టి, వర్షిణిలు టాస్క్ ఓడిపోయినందుకు నామినేషన్స్ లో ఉన్నారు. మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.