‘బిగ్ బాస్-4’ తన రికార్డ్ తానే బీట్ చేసిన ‘కింగ్’ నాగ్..

  • Published By: sekhar ,Published On : September 17, 2020 / 04:46 PM IST
‘బిగ్ బాస్-4’ తన రికార్డ్ తానే బీట్ చేసిన ‘కింగ్’ నాగ్..

Updated On : September 17, 2020 / 6:31 PM IST

Bigg Boss Telugu 4 Launch Episode TRP Rating: బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి సత్తా చాటింది. గత సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కింగ్ నాగార్జున సీజన్-4కి కూడా హోస్ట్ చేస్తున్నారు. ఈ రియాలిటీ షో ప్రారంభ ఎపిసోడ్‌ అత్యధికంగా 18.5 (ఏపీ+తెలంగాణ అర్బన్) టీఆర్పీ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు వచ్చిన బిగ్ బాస్ అన్ని సీజన్స్ ఫస్ట్ ఎపిసోడ్స్‌లో ఇదే హైయ్యెస్ట్ కావడం విశేషం.


జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్-1 లాంచింగ్ ఎపిసోడ్ 16.18 టీఆర్పీ దక్కించుకోగా నాని 15.5, నాగ్ హోస్ట్ చేసిన 3వ సీజన్ తొలి ఎపిసోడ్ 17.9 రేటింగ్ రాగా వాటిని అధిగమించి 4వ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ఏకంగా 18.5 రేటింగ్ సాధించి బిగ్ బాస్ సీజన్స్‌లో హైయ్యెస్ట్ టీఆర్పీ సాధించిన ఎపిసోడ్‌గా నిలిచింది. అలాగే 4.5 రీచింగ్‌తో పాటు ప్రతి ముగ్గురు తెలుగువారిలో ఇద్దరు బిగ్ బాస్‌ను ట్యూన్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో నాగ్ క్రేజ్‌కి ఇదొక నిదర్శనం మాత్రమే అంటున్నారు అక్కినేని అభిమానులు.Bigg Boss Telugu 4

Bigg Boss Telugu 4