Bigg Boss Telugu 8 Day 33 Promo 1 Hilarious Morning Masti Task
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఐదో వారం కొనసాగుతోంది. మిడ్‌వీక్ ఎలిమినేషన్‌లో ఆదిత్యం ఓం హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. దీంతో ప్రస్తుతం 9 మంది ఉన్నారు. ఇక నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఇందులో బిగ్‌బాస్ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. నేనే చెప్పిందే జరుగుతుందని, కంటెస్టెంట్ల జాతకాలు చెప్పాలని టాస్క్ ఇచ్చాడు. ఇందుకు జ్యోతిష్యుడిగా మణికంఠను ఎంపిక చేశారు. ఇక జ్యోతిష్యుడిగా మణికంఠ నవ్వులు పూయించాడు.
ముందుగా కొత్త చీఫ్‌గా నబీల్ జాతకాన్ని చెప్పాడు. ఆతరువాత ప్రేరణకు చెప్పాడు. ఇక విష్ణుప్రియ మాట్లాడుతూ.. ఈ హౌస్‌లో అంతా బాగానే ఉందని, ఒక వ్యక్తి మీద మనసు లబ్‌డబ్ లబ్‌డబ్ అంటూ కొట్టుకుంటుందని చెప్పింది. ఆమె చేయి చూస్తూ.. ఈ బిగ్‌బాస్ పంజరంలో రెండు ప్రేమ చిలుకలు అంటే మీవే తల్లి అంటూ మణికంఠ అన్నాడు. సింగిల్‌గానే ఉంటానా లేదంటే వైల్డ్ కార్డు ఎంట్రీలో ఎవరైనా మంచి హ్యాండ్ సమ్ హంక్ వస్తాడా అని యష్మి అడిగింది.
Akkineni Nagarjuna : హీరో నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా..
హంక్ అంటే వాడు బంక్ అయిపోతాడు.. చీల్చి చెండాడే టైపు నువ్వు. ఎంగిలి పడిన విస్తరాకు కూడా చినిగిపోవాల్సిందే తల్లి అంటూ మణికంఠ చెప్పాడు. క్లారిటీ ఉందిగా నీకు అంటూ యష్మి.. మణికంఠను ఉద్దేశించి అంది. మొత్తంగా ప్రొమో మొత్తంగా ఫన్ ఫుల్‌గా సాగింది.