Bigg Boss 8 : అడ్డంగా బుక్కైన అవినాశ్..! రోహిణిపై గంగ‌వ్వ పంచ్‌లు

వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ త‌రువాత తొలి ప్రొమో విడుద‌లైంది.

Bigg Boss Telugu 8 Day 35 Promo 1 Non stop Entertainment

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో ఐదు వారాలు పూర్తి అయ్యాయి. ఆరో వారంలోకి అడుగుపెట్టేశాం. ఆదివారం వైల్డ్‌కార్డ్ ద్వారా 8 మంది హరితేజ, టేస్టీ తేజ, గంగవ్వ, ముక్కు అవినాష్, గౌతమ్, నయని పావని, మెహబూబ్, రోహిణి లు హౌస్‌లో అడుగుపెట్టారు. ప్ర‌స్తుతం హౌస్‌లో 16 మంది ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ త‌రువాత తొలి ప్రొమో విడుద‌లైంది.

గంగ‌వ్వ హౌస్‌లో న‌వ్వులు పూయించింది. మేము టీ పెట్టుకోవ‌డానికి పాలు లేవ‌ని రోహిణి అంది. పాలు ల‌గ్జ‌రీ అని న‌బీల్ అన్నాడు. ముందే చెబితే 10 పాల ప్యాకెట్లు తీసుకువ‌చ్చే వాళ్లం గ‌దా అంటూ గంగ‌వ్వ అన‌డంతో అక్క‌డ న‌వ్వులు విరిశాయి. నేను పెద్ద మ‌నిషిని అని గంగ‌వ్వా అన‌గా.. నేను పెద్ద మ‌నిషినే అని రోహిణి అంది.. వెంట‌నే ఎంద‌రు పిల్ల‌లు పుట్టారు నీకు అంటూ రోహిణిని గంగ‌వ్వ ప్ర‌శ్నించింది. ఇలా గంగ‌వ్వ, రోహిణి ల‌ మ‌ధ్య స‌ర‌దా సంబాష‌ణ న‌డిచింది.

Devara : 10 రోజుల్లో దేవ‌ర క‌లెక్ష‌న్స్ ఎన్ని కోట్లు అంటే..?

ఇక ముక్కు అవినాశ్ అడ్డంగా బుక్ అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. నేనేదో యుద్ధానికి పోతున్నట్లు అందరూ క్లాప్స్‌ కొడుతున్నారంటూ త‌న దైన శైలిలో కామెడీ పండించాడు అవినాశ్. వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లో సంద‌డి మొద‌లైన‌ట్లుగా క‌నిపిస్తోంది.