Bigg Boss 8 : మిడ్‌వీక్ ఎలిమినేష‌న్‌.. బ‌య‌ట‌కు వ‌చ్చేది అత‌డేనా?

ఈ వారం మ‌ధ్య‌లోనే ఓ ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని ఆదివారం నాటి ఎపిసోడ్‌లోనే నాగార్జున చెప్పిన సంగ‌తి తెలిసిందే.

Bigg Boss 8, Aditya Om, Mid week elimination

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో ఐదోవారం కొన‌సాగుతోంది. ఈ వారం మ‌ధ్య‌లోనే ఓ ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని ఆదివారం నాటి ఎపిసోడ్‌లోనే నాగార్జున చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ వారం నామినేష‌న్స్‌లో ఆరుగురు నైనిక, నాగ మణికంఠ, విష్ణుప్రియ, నబీల్, ఆదిత్య ఓం, నిఖిల్ ఉన్నారు. వీరిలో మిడ్‌వీక్‌లో ఒక‌రు, వీకెంట్‌లో ఒక‌రు ఎలిమినేట్ కానున్నారు అని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆ త‌రువాత వైల్డ్ కార్డు ఎంట్రీస్ బిగ్‌బాస్‌లో అడుగుపెట్ట‌నున్నార‌ని టాక్‌. ఇక గురువారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా హౌస్‌ నుంచి ఎవరు ఇంటిబాట పడుతారోనని అందరూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నామినేషన్స్‌లో ఉన్న వారిలో నబీల్‌కు ఎక్కువ ఓట్లు ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది.

Nagarjuna: పొలిటికల్‌గా నాగార్జున టార్గెట్‌ అయ్యారా?

నేటి ఎపిసోడ్‌కు సంబంధించి విడుదలైన బిగ్‌బాస్‌ ప్రోమోలో ఆదిత్య, నైనిక, విష్ణుప్రియలు డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ ముగ్గురిని ల‌గేజ్ స‌ర్దుకోవాల‌ని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఆ త‌రువాత ఈ ముగ్గురిలో హౌస్‌లో ఉండ‌డానికి అన‌ర్హులు ఎవ‌రో చెప్పాల‌ని మిగిలిన హౌస్‌మేట్స్ ను బిగ్‌బాస్ సూచించాడు.

కాగా.. ఈ ముగ్గురిలో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిన‌ట్లుగా టాక్‌. అయితే.. ఆయ‌న్ను సీక్రెట్ రూమ్‌కి పంపించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Rakul Preet Singh : నా పేరును వాడుకోవ‌డం మానేయండి.. ర‌కుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్‌..