Bigg Boss Telugu 9 : చుక్క‌లు చూపిస్తానంటున్న అభిజిత్‌.. మారిపోయిన బిగ్‌బాస్ గొంతు.. ప్రొమో చూశారా ?

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో తొమ్మిదో సీజ‌న్ (Bigg Boss Telugu 9) అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. అయితే.. ఈ సారి ఈ షో క‌న్నా..

Bigg Boss Telugu Season 9 Agnipariksha Abhijeet Promo Released

Bigg Boss Telugu 9 : బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో ఇప్ప‌టికే ఎనిమిది సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఇక అతి త్వ‌ర‌లోనే తొమ్మిదో సీజ‌న్ (Bigg Boss Telugu 9) ప్రారంభం కానుంది. అయితే.. ఈ సారి ఈ షో క‌న్నా ముందే అగ్నిప‌రీక్ష అంటూ ఓ ప్రోగ్రామ్ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు.

ఇందులో సామాన్యుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. వీరిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించ‌నున్నారు. ఈ షోలో ముగ్గురు..  బిగ్‌బాస్‌ మాజీ విన్నర్స్‌ అభిజిత్‌, బిందు మాధవి, న‌వ‌దీప్‌లు జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

ఈ అగ్ని ప‌రీక్ష షోకు శ్రీముఖి హోస్ట్‌గా చేయ‌నుంది. తాజాగా ఈ షోకు సంబంధించి పెద్దపులి అభిజిత్‌ మళ్లీ వచ్చాడంటూ ప్రొమోను విడుద‌ల చేశారు.

The Bengal Files trailer : వివేక్‌ అగ్నిహోత్రి.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’ ట్రైలర్ వ‌చ్చేసింది..

అభిజిత్‌ మాట్లాడుతూ.. ఓ కంటెస్టెంట్‌గా వచ్చిన త‌న‌ను మ‌ళ్లీ ఈ రోజు జ‌డ్జిగా పిలిచినందుకు ధ‌న్య‌వాదాలు చెప్పాడు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌ను అంద‌రూ ఓ స్వీట్ చాక్లెట్ బాయ్‌గానే చూశార‌న్నారు. ఆగ‌స్టు 22 నుంచి త‌న జ‌డ్జిమెంట్ ఎంత క‌ఠినంగా, క‌ష్టంగా ఉంటుందో బిగ్‌బాస్‌తో పాటు కంటెస్టెంట్స్‌కు చూపిస్తాన‌ని చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan Birthday : ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఇక పండ‌గే.. బిగ్ బర్త్ డే ట్రీట్..!

అయితే.. ఈ ప్రొమోలో బిగ్‌బాస్ వాయిస్ మారిపోయింది. ఎప్పుడూ గంభీరంగా వినిపించే బిగ్‌బాస్‌ గొంతు పేలవంగా మారిపోయింది. అయితే.. ఇది ప్రొమో వ‌రికేనా లేదంటే అగ్నిప‌రీక్ష షో వ‌ర‌కేనా, బిగ్‌బాస్ 9లోనూ ఇదే గొంతు వినిపిస్తుందా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

అగ్నిపరీక్ష షో ఆగస్టు 22 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఇందులో సెల‌క్ట్ అయిన వాళ్లు బిగ్‌బాస్ 9లో సామాన్యులుగా అడుగుపెట్ట‌నున్నారు.