BiggBoss 6 Day 29 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే.. భార్య భర్తలని విడదీసిన బిగ్‌బాస్
ఈసారి నామినేషన్స్ ప్రక్రియ కొంచెం డిఫరెంట్‌గా సాగి కంటెస్టెంట్స్ మధ్య భారీగానే గొడవలకి దారితీసేలా చేసింది. ఈ సారి నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ ని ఇద్దరిద్దరిగా డివైడ్ చేసి వాళ్లలో............
- Saketh U
- Published On : October 4, 2022 / 04:07 PM IST
BiggBoss 6 Day 29 Nominations in House
BiggBoss 6 Day 29 : బిగ్‌బాస్ సీజన్-6లో నాలుగోవారం ఒక ఎలిమినేషన్ తో పూర్తయింది. ఐదోవారం నామినేషన్స్ కూడా మొదటిరోజే పూర్తయ్యాయి. ఈసారి నామినేషన్స్ ప్రక్రియ కొంచెం డిఫరెంట్‌గా సాగి కంటెస్టెంట్స్ మధ్య భారీగానే గొడవలకి దారితీసేలా చేసింది. ఈ సారి నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ ని ఇద్దరిద్దరిగా డివైడ్ చేసి వాళ్లలో ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలంటూ కంటెస్టెంట్స్ కే నిర్ణయాన్ని వదిలేశారు. దీంతో ఎవరికీ వాళ్ళు నామినేట్ అవ్వం అంటూ గొడవలు పెట్టుకున్నారు.
అయితే ఇన్నిరోజులు కలిసి ఆడిన కపుల్ రోహిత్, మరీనా ఫస్ట్ టైం విడిపోయారు. వీరిద్దరిలో ఎవరో ఒకర్ని మాత్రమే నామినేట్ చేసుకోమనడంతో బిగ్‌బాస్ నిర్ణయానికి అంతా ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు జంటగా ఆడిన రోహిత్, మరీనా ఇప్పుడు ఎవరి ఆట వాళ్ళు ఆడాలి. దీంతో రోహిత్ కోసం మరీనా త్యాగం చేసి తను సెల్ఫ్ నామినేట్ అయింది.
Chiranjeevi : జనసేనకు భవిష్యత్తులో నా మద్దతు.. పవన్ రాజకీయాల్లో ఉంటే ప్రజలకి మేలు..
ఇనయా, శ్రీహాన్‌లను ఒక జంటగా చేయడంతో ఇద్దరికీ అసలే పడదు, దీంతో బాగా గొడవ పడ్డారు. చివరికి నీతో గొడవపడటం వేస్ట్ అంటూ ఇనయా నామినేట్ అయింది. ఇక అర్జున్- సత్యలలో సత్య అర్జున్ తో కాస్త గట్టిగా మాట్లాడేసరికి అర్జున్ సెల్ఫ్ నామినేషన్ చేసేసుకున్నాడు. రేవంత్, ఆదిరెడ్డి మధ్య గొడవ గట్టిగానే జరిగింది. రేవంత్ ఎంతకీ తగ్గకపోవడంతో చేసేదేం లేక ఆదిరెడ్డి నామినేషన్స్‌లోకి వచ్చాడు. ఇలా ఇద్దరిద్దరిలో గొడవపడి ఒకరు సెల్ఫ్ నామినేట్ అయ్యారు కంటెస్టెంట్స్.
మొత్తంగా ఈవారం ఇనయా, చంటి, అర్జున్, ఆదిరెడ్డి, మరీనా, ఫైమా,బాలాదిత్య, వసంతిలు నామినేషన్స్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో చూడాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
