Chiranjeevi : జనసేనకు భవిష్యత్తులో నా మద్దతు.. పవన్ రాజకీయాల్లో ఉంటే ప్రజలకి మేలు..

చిరంజీవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై, జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి మాట్లాడుతూ.. ''పవన్ నిబద్దత గురించి నాకు తెలుసు. అలాంటి వాడు రాజకీయాల్లో ఉంటే ప్రజలకి మేలు కలుగుతుంది. పవన్ స్థాయిని............

Chiranjeevi : జనసేనకు భవిష్యత్తులో నా మద్దతు.. పవన్ రాజకీయాల్లో ఉంటే ప్రజలకి మేలు..

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి దసరాకి గాడ్ ఫాదర్ గా రానున్నారు. మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ని తెలుగులో గాడ్‌ఫాదర్‌ గా చిరంజీవి రీమేక్ చేశారు. మోహనరాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించగా నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబరు 5న గాడ్ ఫాదర్ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్‌ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

తాజాగా హైదరాబాద్ లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై, జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి మాట్లాడుతూ.. ”పవన్ నిబద్దత గురించి నాకు తెలుసు. అలాంటి వాడు రాజకీయాల్లో ఉంటే ప్రజలకి మేలు కలుగుతుంది. పవన్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారు. పవన్ మంచి స్థాయికి ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నాను. జనసేనకు భవిష్యత్తులో మద్దతు ఇవ్వొచ్చేమో. నేను పొలిటికల్ గా సైలెంట్ గా ఉంటేనే పవన్ కి మంచి జరుగుతుంది. భవిష్యత్తులో తమ్ముడు పవన్ ప్రజలని పాలించొచ్చు కూడా” అని తెలిపారు.

UnStoppable Season 2 : బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ సీజన్ 2 టీజర్ మేకింగ్ స్టిల్స్

దీంతో చిరంజీవి జనసేనకు ప్రత్యక్షంగానే మద్దతు ప్రకటించేశారు. భవిష్యత్తులో పవన్ CM అవ్వాలని అని ఇండైరెక్ట్ గానే అన్నారు. చిరు చేసిన వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తుండగా ఏపీ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి. చిరంజీవి జనసేనకు మద్దతు ఉంటే కచ్చితంగా పవన్ కి ఓట్లు ఎక్కువే వస్తాయని నమ్ముతున్నారు.