BiggBoss fame Kaushal Manda Interesting Comments on his Fans at Right Movie Pre Release event
Kaushal Manda : ఎప్పుడో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన కౌశల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు, మోడలింగ్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్(Bigg Boss) సీజన్ 2 విన్నర్ గా నిలిచిన కౌశల్ స్టార్ అయి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ సీజన్ సమయంలో కౌశల్ బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు కౌశల్ హీరోగా ‘రైట్’ అనే సినిమాతో రాబోతున్నాడు.
మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై లుకలాపు మధు, మహంకాళి దివాకర్ నిర్మాతలుగా కౌశల్ మంద, లీషా ఎక్లైర్స్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘రైట్’. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మెమోరీస్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రానుంది. డిసెంబర్ 30న రైట్ సినిమా విడుదల కానుండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు మనోజ్(Manchu Manoj) ముఖ్య అతిధిగా వచ్చారు.
ఈ ఈవెంట్లో మంచు మనోజ్ మాట్లాడుతూ.. కౌశల్ కష్టపడి సొంతంగా ఎదిగిన వ్యక్తి. తనకంటూ ఒక ఆర్మీని ఏర్పరుచుకున్నారు. అది మామూలు విషయం కాదు. ఎన్నో స్ట్రగుల్స్ చూసి కౌశల్ ఇక్కడిదాకా వచ్చాడు. ఇయర్ ఎండింగ్ కి ఈ రైట్ సినిమాతో హిట్ కొట్టాలి. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది అని అన్నారు.
రైట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో కౌశల్ మాట్లాడుతూ.. నటుడిగా పేరు సంపాదించాలని 18 ఏళ్ళ వయసులో రాజకుమారుడు సినిమాతో పరిశ్రమకు వచ్చి కష్టపడ్డాను. బిగ్ బాస్ నాకు బాగా కలిసి వచ్చింది. నా కోసం ఒక ఆర్మీ తయారవడం నా అదృష్టం. నా ఆర్మీ అందర్నీ కలుసుకోవడానికి 8 నెలలు అన్ని ప్రాంతాలు తిరిగాను. నా ఫ్యాన్స్ నన్ను హీరోగా చూడాలని అడిగారు. వాళ్ళ కోసమే ఇప్పుడు హీరోగా వస్తున్నాను. మా తాతయ్య, నాన్న నాటకాల్లో చేశారు. ఎన్నో అవార్డులు తెచ్చుకున్నా గుర్తింపు రాలేదు. కానీ నాకు నా ఫ్యాన్స్ తో గుర్తింపు వచ్చింది. కరోనా ముందు మొదలుపెట్టి ఎన్నో అడ్డంకులు ఎదురైనా తట్టుకొని నిలబడి ఈ సినిమా పూర్తి చేసాము. సినీ పరిశ్రమలో అందర్నీ ప్రోత్సహించే మనోజ్ గారు నాకు సపోర్ట్ గా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దీంతో కౌశల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అతని ఫ్యాన్స్ థియేటర్స్ లో రైట్ సినిమా చూడటానికి ఎదురు చూస్తున్నారు.