ఫుల్ టు ఫన్ ఎంటర్ టైనర్ – బ్లాక్ బస్టర్ ‘భీష్మ’ సక్సెస్ సెలబ్రేషన్స్..

యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా.. వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘భీష్మ’ సక్సెస్ సెలబ్రేషన్స్..

  • Publish Date - February 21, 2020 / 10:12 AM IST

యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా.. వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘భీష్మ’ సక్సెస్ సెలబ్రేషన్స్..

యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా.. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరి ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్)..  #BheeshmaSingleForever మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోందీ చిత్రం. మామూలు కథను తీసుకుని దానికి ప్రస్తుత తరానికి బాగా అవసరమైన సేంద్రీయ వ్యవసాయం అనే స్ట్రాంగ్ పాయింట్‌ను టచ్ చేస్తూ డైరెక్టర్ ఇచ్చిన మెసేజ్ కూడా ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. అనుకున్న కథ ఎక్కడా డీవియేట్‌ కాకుండా, అనవసర హంగుల విషయాలకు వెళ్లకుండా దర్శకుడు వెంకీ కుడుముల చాలా జాగ్రత్తగా, పద్దతిగా నడిపించాడు. తను చెప్పాలనుకున్న పాయింట్‌ను పక్కాగా తెరపై ప్రజెంట్‌ చేశాడు.

ఈ విషయంలో వెంకీ కుడుముల నూటికి నూరు మార్కులు సాధించాడు అంటున్నారు విశ్లేషకులు. తాజాగా ‘భీష్మ’ సక్సెస్ సెలబ్రేషన్స్ ప్రొడ్యూసర్ ఆఫీసులో జరిగాయి. ఫుల్ టు ఫన్ ఎంటర్ టైనర్ అంటూ న్యూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. #BlockbusterBheeshma పేరుతో కేక్ కట్ చేసి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ, హీరోయిన్ రష్మిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.