బాబీ సింహా, కష్మీరా జంటగా నటిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
వైవిధ్యభరితమైన పాత్రలతో తమిళనాట తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్ బాబీ సింహా. ‘జిగర్తండా’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న బాబీ సింహా ప్రస్తుతం తెలుగులో మాస్ మహారాజ్ రవితేజ ‘డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నాడు.
బాబీ సింహా హీరోగా నటిస్తున్న చిత్రం గురువారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘డిస్కోరాజా’ నిర్మాత రామ్ తాళ్లూరి సతీమణి రజనీ తాళ్లూరి, బాబీ సింహా సతీమణి రేష్మీ సింహా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రమణన్ పురుషోత్తమ దర్శకత్వం వహిస్తుండగా, కష్మీరా కథానాయికగా నటించనుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఎడిటింగ్ : వివేక్ హర్షన్, ఫైట్స్ : స్టంట్ సిల్వ, నిర్మాణం : ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ముద్ర ఫిలిం ఫ్యాక్టరీ.