Sameer Khakhar : ఇండస్ట్రీలో మరో నటుడు కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్..

ప్రముఖ నటుడు సమీర్ ఖఖర్ మరణించారు. 1986 లో వచ్చిన నుక్కడ్ అనే టీవీ సిరీస్ తో బాగా పాపులారిటీ తెచ్చుకున్న సమీర్ అనంతరం బాలీవుడ్ లో పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించాడు. దాదాపు 50 కి పైగా సినిమాల్లో, 10 కి పైగా సీరియల్స్ లో...................

Sameer Khakhar :  ఇటీవల సినీ పరిశ్రమలో వరుస మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖుల్ని కోల్పోయి సినీ పరిశ్రమలు విషాదంలో ఉన్నాయి. బాలీవుడ్ లో ఇటీవలే ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మరణించడంతో విషాదం నెలకొంది. బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు సైతం ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన మరణ వార్త నుంచి ఇంకా తేలుకోకముందే బాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది.

ప్రముఖ నటుడు సమీర్ ఖఖర్ మరణించారు. 1986 లో వచ్చిన నుక్కడ్ అనే టీవీ సిరీస్ తో బాగా పాపులారిటీ తెచ్చుకున్న సమీర్ అనంతరం బాలీవుడ్ లో పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించాడు. దాదాపు 50 కి పైగా సినిమాల్లో, 10 కి పైగా సీరియల్స్ లో సమీర్ నటించాడు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సమీర్ నేడు తెల్లవారుజామున హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడు.

Samantha : పెద్దమ్మ తల్లి టెంపుల్ లో శాకుంతలం టీంతో సమంత.. ప్రమోషన్స్ షురూ..

సమీర్ ఖఖర్ మరణంపై అతని సోదరుడు గణేష్ ఖఖర్ మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలో చాలా వరకు అవయవాలు ఫెయిల్ అయ్యాయి. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూనే నేడు తెల్లవారు జామున మరణించాడు అని తెలిపాడు. దీంతో సమీర్ ని గుర్తుచేసుకుంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు అతనికి సంతాపం ప్రకటిస్తున్నారు. పలువురు సమీర్ కి నివాళులు అర్పిస్తున్నారు. సమీర్ ఖఖర్ మరణంతో మరోసారి బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు