Shreyas Talpade : పుష్ప హిందీ డబ్బింగ్ కోసం నోట్లో కాటన్ పెట్టుకొని మరీ.. బాలీవుడ్ నటుడు కామెంట్స్..

హిందీలో అల్లు అర్జున్ పాత్రకి శ్రేయాస్ తల్పాడే డబ్బింగ్ చెప్పారు. పార్ట్ వన్ కి కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు.

Bollywood actor Shreyas Talpade puts cotton in her mouth for pushpa movie Hindi dubbing

Shreyas Talpade : తాజాగా పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రష్మిక మందన్న, బన్నీ జంటగా నటించిన ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా మొదటి ఆట నుండే కాసుల వర్షం కురిపిస్తుంది. . రెండు రోజుల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఇక ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా తెలిపారు.

Also Read : Namrata Shirodkar – Sitara : దుబాయ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సితార, నమ్రత..

పుష్ప 2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా కలెక్షన్స్ దుమ్ము లేపుతుంది. ఇక హిందీలో అయితే మొదటిరోజే 72 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కాగా హిందీలో అల్లు అర్జున్ పాత్రకి శ్రేయాస్ తల్పాడే డబ్బింగ్ చెప్పారు. పార్ట్ వన్ కి కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు. అయితే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక అందులో పుష్ప రాజ్ కి డబ్బింగ్ చెప్తున్నప్పుడు విషయాలను పంచుకున్నారు.

ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..” ఈ సారి ఆయన పాత్ర మరింత స్వాగ్ తో కూడి ఉంటుంది. ఆ స్వాగ్ అలా కంటిన్యూ అవ్వాలంటే ఆయన బాడీకి తగట్టు నా వాయిస్ ఉండాలి. ఆయన రూలింగ్ నా వాయిస్ లో ఉండాలి. నా వాయిస్ ఈ సినిమాకి తోడైనందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. పుష్ప రాజ్ వాయిస్ చాలా గంభీరంగా ఉండాలి. అలాగే ఆయన డ్రింక్, స్మోక్, గుట్కా నములుతున్నప్పుడు వాయిస్ చెప్పడం కష్టమైంది. అప్పుడు నోట్లో కాటన్ పెట్టుకొని చెప్పాను” అంటూ తెలిపారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


శ్రేయాస్ తల్పాడే.. ఈయన ఎన్నో సినిమాలకి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ మాత్రమే కాదు. ఈయన ఒక మంచి నటుడు. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. మరాఠీ సినిమాలు కూడా చేశారు. నటుడిగానే కాకుండా డెరెక్టర్ గా, నిర్మాతగా కూడా సత్తా చాటారు. ఇలా అన్ని రంగాల్లో కొనసాగుతూ బిజీగా ఉన్నాడు.