Sonu Sood Helped A Man
Sonu Sood foundation : కరోనా కష్ట కాలం నుంచి ఎందరికో అండగా నిలుస్తూ ఆదుకుంటూ వస్తున్నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Sonu Sood). సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినప్పటికీ బయట మాత్రం రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తన ఫౌండేషన్ సాయంతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. అలా ఓ సామాన్యుడి కలను నిజం చేశాడు. పైలట్ కావాలని ఎన్నో కలలు కన్నప్పటికీ అతడి ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించలేదు. అయితే.. సోనూ సాయంతో అతడు ప్రస్తుతం ఏవియేషన్ అకాడమీలో గ్రౌండ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నాడు.
ఈ వ్యక్తి పేదరికంలో జన్మించాడు. పైలట్ కావాలనేది అతడి కల. అయితే అందుకు అతడి ఆర్థిక స్తోమత సరిపోయేది కాదు. అయినప్పటికీ ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ ఎయిర్‌లైన్‌లో హెల్పర్‌గా, క్లీనర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలో అతడి జీవితంలో ఓ వెలుగు నింపింది ఎవరో కాదు బాలీవుడ్ నటుడు సోనూ సూద్.
Adipurush : చంద్రయాన్ సక్సెస్‌తో ఆదిపురుష్ పై విమర్శలు.. ఓం రౌత్‌ని ఆడేసుకుంటున్న నెటిజన్లు..
తన కల ఇక నిజం కాదు ఏమో అని బాధపడ్డాడుతున్న సమయంలోనే సోనూ సూద్ ఫౌండేషన్‌ను ఆశ్రయించాడు. అతడు అభ్యర్థించిన వెంటనే ఆర్థిక సాయం అందింది. అది అతడి జీవిత ఆశయానికి పునరుజ్జీవం ఇచ్చింది. అతడి కల లకు రూపాన్ని ఇవ్వడమే కాదు అతడిని ఓ పైలట్ చేసింది. ఇక ఇప్పుడు అతడి డ్రీమ్ ఏంటంటే.. సోనూ సూద్‌ను తాను నడుపుతున్న విమానంలో ఎక్కించుకోవాలని. ఆ క్షణం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.
ఇప్పుడు తనను ఎన్నో యూట్యూబ్ ఛానెళ్లు ఇంటర్వ్యూ చేస్తున్నాయని, అసలైన రియల్ హీరో సోనూ సూద్ స్వయంగా తన విషయంలో గర్వపడుతున్నానని చెప్పడం ఓ గొప్ప పురస్కారంగా బావిస్తున్నట్లు తెలిపాడు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం తన జీవితాన్నే కాదు ఎంతో మంది జీవితాలను కూడా మార్చేసిందన్నాడు. తన ఇంటర్వ్యూ వీడియోలు చూసిన తరువాత తన లాగే చాలా మంది పైలట్‌లుగా కావాలని బావిస్తున్నట్లు చెప్పారని అంటున్నాడు. సోను సూద్ వల్లే ఇదంతా సాధ్యమైందన్నాడు. సోనూసూద్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాడు.
ఓ సామాన్యుడు పైలట్ అయిన కథ ప్రస్తుతం ఎంతో మందిలో ఆశలను చిగురింపజేస్తోంది. సమయానికి సాయం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు అనడానికి ఇతడే నిలువెత్తు సాక్ష్యం.