Nikita Dutta : బాలీవుడ్ నటిపై దుండగుల దాడి… బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది
కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ నటి చౌరాసియాపై దాడి చేసిన ఘటన మరవకముందే ఇటీవల ఓ బాలీవుడ్ నటిపై కూడా దాడి జరిగింది. పలు సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి నికితా దత్తా .....
- Saketh U
- Published On : December 3, 2021 / 07:03 AM IST
Nikita
Nikita Dutta : కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ నటి చౌరాసియాపై దాడి చేసిన ఘటన మరవకముందే ఇటీవల ఓ బాలీవుడ్ నటిపై కూడా దాడి జరిగింది. డైబుక్, ఏక్‌డుజ్‌కే వాస్తే, ది బిగ్‌బుల్, కబీర్ సింగ్ వంటి పలు సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి నికితా దత్తా కూడా వాకింగ్ చేస్తుండగా ఆమెపై దాడి చేసి దుండగులు సెల్‌ఫోన్‌ను లాక్కెళ్లారు. తాజాగా ఈ విషయంపై ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది నికితా.
Bigg Boss 5 : ప్రియాంక సింగ్‌కు తమన్నా సపోర్ట్.. ఏ ట్రాన్స్‌జెండర్ వల్ల ఇది సాధ్యం కాలేదు..
”ఇప్పటివరకు తన ఫోన్ తిరిగి లభించలేదని, ఆ ఘటన జరిగిన రోజు అసలు నిద్రపోలేదని తెలిపింది. ఆ రోజు జరిగిన ఘటన నిజంగా భయంకరం. నాకు నా ఫోన్ దొరుకుతుందన్న నమ్మకం కూడా పోయింది. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కూడా భయంగా ఉంది. సాధారణ వాకింగ్ చేయడం అంటే నాకిష్టం. కానీ ధైర్యం చేసి నేనిప్పట్లో బయటకు వెళ్లలేను. అదంత మంచిదని కూడా అనిపించడం లేదు అని వాపోయింది.
Radhe Shyam: పూజ పాత్రకి విషాదాంతం.. అప్డేట్స్ ఏం చెప్తున్నాయ్?
”దీన్నో పీడకలగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీ అందరికీ చెప్పేదొక్కటే.. రోడ్డు మీదున్నప్పుడు మీరు ఫోన్ వాడుతూ, చాట్ చేస్తూ, మెసేజ్‌లు చేయడంలో మునిగిపోవద్దు” అని జనాలకి సలహా ఇచ్చింది నికితా దత్తా.
