Chhavi Mittal : పిల్లలకు లిప్ కిస్ ఇచ్చిన బాలీవుడ్ నటి.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఆ నటి ఏమందంటే??

బాలీవుడ్ నటి ఛవి మిట్టల్(Chhavi Mittal) తన పిల్లలకు లిప్ కిస్ లు ఇస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి...........

Chhavi Mittal :  సాధారణంగా పిల్లలను ముద్దు చేస్తూ, వారితో సరదాగా ఉంటూ పిల్లలకు ముద్దులు ఇస్తూ ఉంటారు. చిన్నపిల్లలకు ముద్దులు ఇస్తూ వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే చిన్న పిల్లలకు పెదాల మీద చాలా రేర్ గా పెడుతూ ఉంటారు. మనకు తెలిసినంతలో, మన చుట్టూ చిన్నపిల్లలు ఎవరైనా సరే వారికి లిప్ కిస్ ఇవ్వరు. తాజాగా బాలీవుడ్ నటి ఛవి మిట్టల్(Chhavi Mittal) తన పిల్లలకు లిప్ కిస్ లు ఇస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే ఈ ఫోటోలపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. పిల్లలకు లిప్ కిస్ ఇవ్వడమేంటి, వాళ్లకు ఇప్పట్నుంచే ఏం నేర్పిస్తున్నారు అని కొంతమంది విమర్శిస్తూ కామెంట్స్ చేయగా, మరికొంతమంది పిల్లలకు మీ బ్యాక్టీరియాని పంచుతున్నారు, ఆరోగ్యపరంగా ఇది మంచిది కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్న పిల్లలకు లిప్ కిస్ ఇస్తున్న ఫోటోలని ఛవి మిట్టల్ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొంది. మాములు నెటిజన్లే కాక కొంతమంది ప్రముఖులు కూడా ఆమె చర్యని తప్పు పడుతూ కామెంట్స్ చేశారు. ఒకవేళ నువ్వు వాళ్లకు ఇలా లిప్ కిస్ ఇచ్చినా అందరికి తెలిసేలా ఇలా పెట్టాలా అంటూ కొంతమంది ప్రముఖులు కూడా కామెంట్స్ చేశారు.

NBK 108 : ఈ సారి మీ ఊహలకు మించి.. ఉగాది స్పెషల్ NBK 108 నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ రిలీజ్..

ఈ ట్రోల్స్ అన్ని చూసి ఛవి మిట్టల్ ఆగకుండా మరిన్ని లిప్ కిస్ ఫోటోలు పోస్ట్ చేసింది. తన పిల్లలకు లిప్ కిస్ లు ఇస్తున్న ఫోటోలు మరిన్ని షేర్ చేసి.. ఒక తల్లి పిల్లలపై చూపించే ప్రేమకి ఇలాంటి కామెంట్స్ వస్తాయని నేను ఊహించలేదు. నేను నా పిల్లలకు ముద్దులు ఇస్తున్న మరి కొన్ని ఫోటోలు కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే వారిపై నాకున్న అమితమైన ప్రేమను ఎలా చూపించాలో తెలియదు. ఇదొక పద్ధతి. కౌగలింతలు, ముద్దులతో వారిపై నాకున్న ప్రేమను చూపిస్తాను. నాపై వచ్చిన ట్రోల్స్ కి నాకు సపోర్ట్ గా నిలిచినవాళ్లకు థాంక్యూ, ఇంకా మానవత్వం బతికే ఉంది. ఇలా అనే వాళ్ళు తమ పిల్లలపై ప్రేమను ఎలా చూపిస్తారో తెలియచేయండి అని కౌంటర్ ఇచ్చింది ఛవి మిట్టల్. అలాగే కొంతమంది తనకు తెలిసిన వాళ్ళు అంతా తమ పిల్లలకు లిప్ కిస్ లు ఇస్తూ ఆ ఫోటోలను చ్చవి మిట్టల్ తో కలిసి షేర్ చేస్తూ ఆమె సపోర్ట్ కూడా చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు