NTR : వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆ హీరోయిన్ నటిస్తుందా?

హృతిక్ రోషన్, ఎన్టీఆర్, జాన్ అబ్రహంలు ముఖ్య పాత్రల్లో కియారా అద్వానీ ఓ హీరోయిన్ గా ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాగా వార్ 2 రానుంది.

Bollywood Actress Playing Opposite to NTR IN War 2 Movie

NTR War 2 : ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత ప్రస్తుతం కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్‌లో దేవర(Devara) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. అంతకుముందే వార్ 2 సినిమాలో హృతిక్ తో కలిసి ఎన్టీఆర్ నటించబోతున్నాడు. YRF స్పై యూనివర్స్ లో భాగంగా వార్ 2 సినిమా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

హృతిక్ రోషన్, ఎన్టీఆర్, జాన్ అబ్రహంలు ముఖ్య పాత్రల్లో కియారా అద్వానీ ఓ హీరోయిన్ గా ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాగా వార్ 2 రానుంది. ఇప్పటికే స్పెయిన్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. కార్స్ లో సూపర్ ఛేజింగ్ సీక్వెన్స్ ని షూట్ చేశారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ గా మారాయి. తాజాగా ఈ సినిమా నుంచి బాలీవుడ్ లో ఒక అప్డేట్ వినిపిస్తుంది.

Also Read : Kantara 2 : కాంతార 2 అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే.. ఈసారి ఏకంగా 100 కోట్ల బడ్జెట్‌తో..

వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ చేయబోతున్నట్టు, ఎన్టీఆర్ సరసన శార్వరి అనే బాలీవుడ్ భామ నటించబోతున్నట్టు సమాచారం. మోడలింగ్ చేసి, పలు సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన శార్వరి ఆ తర్వాత ఓ వెబ్ సిరీస్ తో నటిగా మారింది. అనంతరం బంటి ఔర్ బబ్లీ 2 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శార్వరి. ప్రస్తుతం ఓ రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది. తాజాగా వార్ 2లో ఎన్టీఆర్ సరసన ఈ భామ ఛాన్స్ కొట్టేసినట్టు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దీనిపై చిత్రయూనిట్ అయితే అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.