Pooja Dadwal: పాపం.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు టిఫిన్ సెంటర్ నడుపుకుంటోంది.. ఎవరో గుర్తుపట్టారా?

సల్మాన్ ఖాన్ తో హీరోయిన్ గా నటించిన పూజా దాద్వాల్(Pooja Dadwal) ప్రస్తుత టిఫిన్ సెంటర్ నడుపుకుంటోంది.

Bollywood actress Pooja Dadwal present situation and details

  • సల్మాన్ హీరోయిన్ నేడు రోడ్డున పడింది.
  • టీబీ మహమ్మారితో కుప్పకూలిన నటి జీవితం.
  • పొట్టకూటి కోసం ఇప్పుడు టిఫిన్ సెంటర్.

సినిమా స్టార్స్ జీవితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని చెప్పడానికి నటి పూజా దద్వాల్ జీవితమే ఒక నిదర్శనం. 1995లో ‘వీర్‌గతి’ చిత్రంలో ఏకంగా సల్మాన్ ఖాన్ సరసన కథానాయికగా నటించిన ఈమె, అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ సినిమా పరాజయం పాలవ్వడం, ఆ తర్వాత చేసిన ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెండితెరపై అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపై అదృష్టాన్ని పరీక్షించుకున్నా, అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది. చివరకు పెళ్లి చేసుకుని గోవాలో స్థిరపడినా, విధి సహకరించలేదు.

Poonam Pandey: బాబోయ్.. పూనమ్ పాండే ఎద అందాల రచ్చ.. మాములుగా లేదుగా

భర్తతో సంతోషంగా ఉన్న సమయంలో టీబీ మహమ్మారి పూజా జీవితాన్ని అతలాకుతలం చేసింది. అనారోగ్యం కారణంగా సొంత భర్త, అత్తమామలు ఆమెను ముంబైలో వదిలేసి వెళ్ళిపోయారు. కన్నవారు, స్నేహితులు కూడా మొహం చాటేయడంతో అనాథగా మిగిలిపోయిన ఆమెను దర్శకుడు రాజేంద్ర సింగ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆపన్నహస్తం కోసం ఆమె చేసిన ఆర్తనాదం సల్మాన్ ఖాన్‌కు చేరడంతో, ఆయన స్పందించి చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. సల్మాన్ చేసిన ఆర్థిక సాయం వల్ల మృత్యువు అంచుల్లోకి వెళ్ళిన పూజా ఐదు నెలల పోరాటం తర్వాత కోలుకుని ప్రాణాలతో బయటపడింది.

ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్ళీ సినిమాల్లో ప్రయత్నించినా కాలం కలిసి రాలేదు. 2020లో చేసిన ఒక పంజాబీ సినిమా కూడా నిరాశపరచడంతో బతుకుదెరువు కోసం ఆమె పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు దర్శకుడు రాజేంద్ర సింగ్ సలహాతో ముంబైలో ఒక చిన్న టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని సాదాసీదా జీవితాన్ని గడుపుతోంది. ఒకప్పుడు స్టార్ హీరో పక్కన మెరిసిన నటి, నేడు పొట్టకూటి కోసం టిఫిన్ బండి నడుపుతుండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆడంబరాల వెనుక దాగి ఉన్న ఇలాంటి విషాద గాథలు సినిమా లోకంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి.