Urvashi Rautela : వంద‌ప్ర‌శ్న‌లేస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్న‌కే స్పంద‌న‌.. ఇద్ద‌రిలో ఒక‌రిని ఎంచుకోమంటే..?

బాలీవుడ్ న‌టి ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇటీవ‌ల టాలీవుడ్‌లో స్పెష‌ల్ సాంగ్స్‌తో అభిమానుల‌ను అల‌రిస్తోంది.

Urvashi Rautela : వంద‌ప్ర‌శ్న‌లేస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్న‌కే స్పంద‌న‌.. ఇద్ద‌రిలో ఒక‌రిని ఎంచుకోమంటే..?

Urvashi Rautela- Pawan Kalyan

Updated On : July 31, 2023 / 6:25 PM IST

Urvashi Rautela- Pawan Kalyan : బాలీవుడ్ న‌టి ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇటీవ‌ల టాలీవుడ్‌లో స్పెష‌ల్ సాంగ్స్‌తో అభిమానుల‌ను అల‌రిస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) న‌టించిన ‘బ్రో ‘సినిమాలో, అంత‌క‌ముందు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీర‌య్య‌’లోనూ ఐట‌మ్ సాంగ్స్‌లో ఆడిపాడింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే అమ్మ‌డు..మొన్న బ్రో సినిమా విడుద‌ల స‌మ‌యంలో చేసిన ట్వీట్ దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే.

బ్రో చిత్రంలో గౌర‌వ‌నీయులైన ఏపీ సీఎం పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) తెరను పంచుకోవడం ఆనందంగా ఉంది అని ట్వీట్ చేయ‌గా.. దీనిపై ట్రోల్స్ వ‌చ్చాయి. దీంతో ప‌వ‌న్ పేరు ప‌క్క‌న ఉన్న సీఎం అనే ప‌దాన్ని తొల‌గించింది. ఇక తాజాగా ట్విట్టర్ లో ఆస్క్ ఊర్వశీ (#ASKUrvashi)పేరుతో హ్యాష్ ట్యాగ్ పెట్టి అభిమానుల ప్రశ్నలకు స‌మాధానాలు ఇచ్చింది.

KotaBommali PS : మలయాళ రీమేక్‌లో శ్రీకాంత్‌.. ఆక‌ట్టుకుంటున్న కోట బొమ్మాళి PS ఫ‌స్ట్ లుక్‌

ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌లో ఒక‌రిని ఎంచుకోమ‌ని ఓ నెటీజ‌న్ అడుగ‌గా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ రెండు చేతులు జోడించిన ఎమోజీతో స‌మాధానం ఇచ్చింది. ఈ ప్ర‌శ్న‌తో పాటు అభిమానులు దాదాపుగా వంద ప్ర‌శ్న‌లు అడిగారు. ఇష్ట‌మైన సినిమా..? ప్ర‌దేశం..? ఏం సినిమాలు చేస్తున్నారు..? అభిమాన క్రికెటర్ ఎవ‌రూ..? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

అయితే.. ఈ ప్ర‌శ్న‌ల్లో ఒక్క ప్ర‌శ్న‌కు కూడా ఆమె స‌మాధానం ఇవ్వ‌లేదు. కేవ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి అడిగిన ప్ర‌శ్న‌కే ఆమె రిప్లై ఇచ్చింది. దీంతో ఊర్వశీ రౌటేలా ఇచ్చిన సమాధానాన్ని పవన్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.

BiggBoss 7 : బిగ్‌బాస్ 7 కొత్త ప్రోమో చూశారా..? కంటెస్టెంట్ల‌కు చుక్క‌లే అంటున్న నాగార్జున‌

Urvashi Rautela Picks Pawan Kalyan

Urvashi Rautela Picks Pawan Kalyan