Bollywood Couple
Bollywood Couple : బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు, నటి పత్రలేఖ 2021 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ హిందీ సినిమాల్లో బిజీగానే ఉన్నారు. రాజ్ కుమార్ రావు హీరోగా వరుస సినిమాలు చేస్తుండగా పత్రలేఖ హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ జంట తల్లితండ్రులయ్యారు.
Also Read : Priyanka Chopra : 23 ఏళ్ళ క్రితమే తెలుగులో సినిమా చేసిన ప్రియాంక చోప్రా.. రాజమౌళి – మహేష్ ఫస్ట్ కాదు..
రాజ్ కుమార్ రావు – పత్రలేఖ పండంటి పాపాయికి జన్మనిచ్చినట్టు అధికారికంగా తెలిపారు. అయితే పాపాయి తమ 4వ వెడ్డింగ్ యానివర్సరీ రోజే పుట్టిందని కూడా ప్రకటించారు. 2021 నవంబర్ 15 న ఈ జంట పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ళ తర్వాత నేడు 2025 నవంబర్ 15న వీరికి ఆడపిల్ల పుట్టింది. దీంతో ఈ బాలీవుడ్ స్టార్ కపుల్ కి ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : Chiranjeevi : వామ్మో చిరంజీవికి ఎంత ఓపికో.. ఆదివారం కూడా.. అందుకే ఆయన మెగాస్టార్..