Priyanka Chopra : 23 ఏళ్ళ క్రితమే తెలుగులో సినిమా చేసిన ప్రియాంక చోప్రా.. రాజమౌళి – మహేష్ ఫస్ట్ కాదు..
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సరసన తెలుగులో నటించడానికి ఒప్పుకుంది ప్రియాంక.(Priyanka Chopra)
Priyanka Chopra
Priyanka Chopra : బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయిపోయింది. హిందీ సినిమాలు కూడా చేయడం మానేసింది. అక్కడే హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుంది. కానీ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సరసన తెలుగులో నటించడానికి ఒప్పుకుంది ప్రియాంక.(Priyanka Chopra)
SSMB29 సినిమా హాలీవుడ్ రేంజ్ లో తీసి అక్కడ కూడా రిలీజ్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేయడంతో ప్రియాంక చోప్రా ని ఈ సినిమాలోకి తీసుకున్నారు రాజమౌళి. హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసే ప్లాన్ ఉండటం, రెమ్యునరేషన్ కూడా భారీగా ఆఫర్ చేయడంతో ప్రియాంక ఈ సినిమా ఒప్పుకుంది. దీంతో ప్రియాంక చోప్రా మొదటిసారి తెలుగులో నటిస్తుందని అంతా అనుకుంటున్నారు.
Also Read : Chiranjeevi : వామ్మో చిరంజీవికి ఎంత ఓపికో.. ఆదివారం కూడా.. అందుకే ఆయన మెగాస్టార్..
అయితే ప్రియాంక చోప్రా 23 ఏళ్ళ క్రితం తెలుగులో ఓ సినిమా చేసింది. GS రవికుమార్ దర్శకత్వంలో ప్రసన్న, మధుకర్ అనే ఇద్దరు కొత్తవాళ్లు హీరోలుగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా 2002 లోనే ఒక తెలుగు సినిమాని ప్రకటించారు. అపురూపం అనే టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించి కొంతభాగం షూటింగ్ కూడా చేసారు. ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్, పోస్టర్స్ కూడా రిలీజ్ చేసారు.
కానీ పలు కారణాలతో, ఆర్ధిక ఇబ్బందులతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాంతో ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. అలా ప్రియాంక చోప్రా మొదట తెలుగులో చేసిన సినిమా అపురూపం. అప్పటికి ప్రియాంక చేసింది ఒక తమిళ్ సినిమానే. తన కెరీర్ ఆరంభంలో తెలుగు సినిమా ఒప్పుకొని చేసింది. కాకపోతే అది రిలీజ్ అవ్వలేదు. మల్లి అసలు సౌత్ వైపే చూడలేదు ప్రియాంక. ఇపుడు 23 ఏళ్ళ తర్వాత రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది ఈ భామ.
Also Read : Rashmika Mandanna : దీక్షిత్ – రష్మిక మందన్న డ్యాన్స్ వర్కింగ్ స్టిల్స్.. ది గర్ల్ ఫ్రెండ్ నుంచి..
ప్రియాంక చోప్రా తెలుగులో చేసిన మొదటి సినిమా అపురూపం సాంగ్స్ మీరు కూడా వినండి..
