Bollywood Director Anurag Kashyap good comments south movies goes viral
Anurag Kashyap : గత కొన్నాళ్లుగా సౌత్ వర్సెస్ బాలీవుడ్ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల సౌత్ సినిమాలు భారీ హిట్ అవ్వడం, బాలీవుడ్ సినిమాలు భారీ పరాజయం అవ్వడంతో సౌత్ లో కంటే ఎక్కువ బాలీవుడ్ లోనే సౌత్ సినిమాల గురించి చర్చ నడుస్తుంది. అక్కడి సెలబ్రిటీలు సౌత్ సినిమాలపై కామెంట్స్ చేస్తున్నారు. చాలా వరకు పాజిటివ్ కామెంట్సే చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సౌత్ సినిమాపై కామెంట్స్ చేశారు.
ఆర్జీవీ శిష్యుడిగా అనురాగ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్టర్ గా సూపర్ హిట్ సినిమాలు తీశాడు. గత కొన్నాళ్ల నుంచి నటుడిగా కుడా పలు సినిమాలు చేస్తున్నాడు. తమిళ్ లో అనురాగ్ కి నటుడిగా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా చెన్నైకి రాగా అక్కడ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. రజినీకాంత్, కమల్ హాసన్ గారి సినిమాల వల్లే నాకు సౌత్ సినిమాల గురించి తెలిసింది. చిరంజీవి, నాగార్జున సినిమాలు హిందీలో డబ్బింగ్ అయి రిలీజ్ అయ్యేవి. గీతాంజలి సినిమాలో లేచిపోదామా అనే డైలాగ్ చూసి ఆసక్తికరంగా అనిపించి సినిమా చూశాను. ఇటీవల తమిళ్ లో విక్రమ్ గారి తంగలాన్ టీజర్ చూశాను. అలాంటి విజువల్స్ హిందీలో కనిపించవు. కేవలం సౌత్ లోనే కనిపిస్తాయి. సౌత్ సినిమాల్లో వాళ్ళ మూలలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సినిమాలు చేస్తారు. కానీ బాలీవుడ్ లో మా మూలాలు ఎక్కువగా చూపించరు. షూటింగ్స్ కి ఎక్కువగా అమెరికా, వేరే బయటి దేశాలకి వెళ్లిపోతుంటారు. మా సినిమాల్లో సహజత్వం తగ్గిపోయింది. కానీ నేటివిటీ, సహజత్వం సౌత్ సినిమాల్లోనే కనిపిస్తుంది. ఇక్కడ నటుడిగా అవకాశాలు వస్తుంటే అందుకే ఓకే చెప్తున్నాను అని తెలిపారు.
Malli Pelli : ఓటీటీలో దూసుకుపోతున్న ‘మళ్ళీ పెళ్లి’.. 100 మిలియన్ ఫ్లస్..
దీంతో బాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ వాళ్ళని విమర్శించి సౌత్ వాళ్ళని పొగడడంతో అనురాగ్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చగా మారాయి.