bollywood drug case:Drug caseలో బాలీవుడ్ హీరోయిన్లే కాదు హీరోల పేర్లు కూడా బయటికొస్తున్నాయి. రియా చక్రవర్తి, దీపికా పదుకొణె, రకుల్‌ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ తదితరులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ఇప్పటికే విచారించింది. హీరోయిన్ల మొబైల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటాను ఎన్‌సీబీ తాజాగా రికవరీ చేసింది. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఇందులో కీలక వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్ ముగ్గురు ప్రముఖ హీరోలు భాగస్వాములేనని ఎన్‌సీబీ గుర్తించింది.
బడా హీరోలుగా చెలామణి అవుతున్న వారంతా డ్రగ్స్ యూజ్ చేస్తున్నట్లు క్లియర్ డిటైల్స్ లభ్యమయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే వారందరికీ సమన్లు జారీ చేసి విచారణకు పిలవనున్నట్లు ఎన్‌సీబీ వెల్లడించింది. ఒకవేళ విచారణలో బడా హీరోలు నోరు విప్పితే గుట్టు రట్టవడం ఖాయంగా కనిపిస్తుంది. అనుమానం రావడంతో వారందరి ఫోన్లపైనా ఎన్‌సీబీ నిఘా పెట్టినట్లు సమాచారం.
డ్రగ్స్ కేసుకు సంబంధించి తన పేరును మీడియా కథనాలలో చర్చించకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును రకుల్ ప్రీత్‌సింగ్ ఆశ్రయించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. మరోవైపు నటి రియా చక్రవర్తి, సోదరుడు షోవిక్ చక్రవర్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పును బాంబే హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది.