Dharmendra
Dharmendra : బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర నేడు ఉదయం మరణించారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం కూడా ఆయన ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరగా ఆయన మరణించారని వార్తలు వచ్చాయి. అప్పుడే ధర్మేంద్ర కూతురు ఆయన ఇంకా మరణించలేదు, తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి అని స్పందించారు.
అనంతరం ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉందని, డిశ్చార్జ్ చేసారని వార్తలు వచ్చాయి. ఇది జరిగిన రెండు వారాలకే ధర్మేంద్ర మరణించినట్టు నేడు అధికారికంగా ఆయన కుటుంబం ప్రకటించింది. నేడు ఉదయం ధర్మేంద్ర 89 ఏళ్ళ వయసులో పలు ఆరోగ్య సమస్యలతో, వయోభారంతో మరణించారు.
దీంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ధర్మేంద్రకు నివాళులు అర్పించడానికి ఆయన ఇంటికి క్యూ కట్టారు. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మేంద్రను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.