×
Ad

Kartik Aaryan : వామ్మో ఏకంగా ఆరు కోట్లు పెట్టి కార్ కొన్న స్టార్ హీరో.. దీంతో నాలుగు ఖరీదైన కార్లు..

తాజాగా కార్తీక్ ఆర్యన్ ఆరు కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ SV మోడల్ కార్ ని కొనుగోలు చేసాడు.

  • Published On : March 16, 2024 / 11:18 AM IST

Bollywood Hero Kartik Aaryan buys Costly Range Rover Car worth six Crores

Kartik Aaryan : సెలబ్రిటీలు కచ్చితంగా కార్ మెయింటైన్ చేయాల్సిందే. కొంతమంది స్టార్ సెలబ్రిటీలు అయితే ఖరీదైన కార్లు కొనుక్కుంటారు. లక్షలు కాదు ఏకంగా కోట్లు ఖర్చుపెడతారు కార్ల కోసం. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా ఇదే పనిచేసాడు. కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు.

తాజాగా కార్తీక్ ఆర్యన్ ఆరు కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ SV మోడల్ కార్ ని కొనుగోలు చేసాడు. కార్ కొనుగోలు అనంతరం కార్ కి పూజ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కొత్త కార్ డిక్కీలో పడుకొని తన కుక్కపిల్లతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటో కూడా వైరల్ గా మారింది. కానీ ఒక్క కార్ కి ఏకంగా ఆరు కోట్లు పెట్టడంతో బాలీవుడ్ లో చర్చగా మారింది.

Also Read : Bhoothaddam Bhaskar Narayana : ఓటీటీలోకి వచ్చేస్తున్న భూతద్దం భాస్కర్ నారాయణ.. ఎక్కడ? ఎప్పట్నించి తెలుసా?

ఇప్పటికే రేంజ్ రోవర్ కాకుండా లాంబోర్గిని, మెక్ లారెన్, మినీ కూపర్.. లాంటి ఖరీదైన మూడు కార్లు ఉన్నాయి. అంతే కాకుండా మాములు కార్లు కూడా ఇంకొన్ని ఉన్నాయి. మొత్తానికి కార్తీక్ ఆర్యన్ దగ్గర కార్ల కలెక్షన్ బాగానే ఉంది. ఇక కార్తీక్ ఇంత ఖరీదైన కార్ కొనుగోలు చేయడంతో అభిమానులు, పలువురు నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు.