Bhoothaddam Bhaskar Narayana : ఓటీటీలోకి వచ్చేస్తున్న భూతద్దం భాస్కర్ నారాయణ.. ఎక్కడ? ఎప్పట్నించి తెలుసా?

థియేటర్స్ లో ప్రేక్షకులని మెప్పించిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.

Bhoothaddam Bhaskar Narayana : ఓటీటీలోకి వచ్చేస్తున్న భూతద్దం భాస్కర్ నారాయణ.. ఎక్కడ? ఎప్పట్నించి తెలుసా?

Bhoothaddam Bhaskar Narayana OTT Streaming Details

Updated On : March 16, 2024 / 11:06 AM IST

Bhoothaddam Bhaskar Narayana : శివ కందుకూరి(Shiva Kandukuri), రాశి సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భూతద్దం భాస్కర్ నారాయణ. మార్చ్ 1న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కి మైథలాజి కాన్సెప్ట్ జోడించి సరికొత్తగా చూపించి హిట్ కొట్టారు. ముఖ్యంగా భూతద్దం భాస్కర్ నారాయణ సెకండ్ హాఫ్ ట్విస్ట్ లతో, క్లైమాక్స్ తో అదరగొట్టింది.

థియేటర్స్ లో ప్రేక్షకులని మెప్పించిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాలో మనం ఇంటిముందు పెట్టే దిష్టిబొమ్మ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మూవీ యూనిట్ కూడా దిష్టిబొమ్మలతో ప్రమోషన్స్ చేసారు. ఇప్పుడు ఓటీటీలోకి కూడా దిష్టిబొమ్మతోనే ప్రమోట్ చేస్తున్నారు. భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ఆహా ఓటీటీలో మార్చ్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Also Read : Mamitha Baiju : ‘ప్రేమలు’ హీరోయిన్‌‌కి హారతి ఇచ్చిన తెలుగు అభిమాని.. ఆశ్చర్యపోయిన మమిత బైజు ..

ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. బొమ్మ కనిపించే ప్రతీసారీ దిమ్మతిరిగే ట్విస్టు ఉంటది! అదెంటో తెలుసుకోవాలని ఉందా? అంటూ దిష్టిబొమ్మ ఫోటోని షేర్ చేస్తూ.. భూతద్దం భాస్కర్ నారాయణ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుందని తెలిపింది. థియేటర్స్ లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూసేయండి.