Mamitha Baiju : ‘ప్రేమలు’ హీరోయిన్‌‌కి హారతి ఇచ్చిన తెలుగు అభిమాని.. ఆశ్చర్యపోయిన మమిత బైజు ..

ప్రేమలు సక్సెస్ మీట్ లో హీరోయిన్ మమిత బైజుకి ఓ అభిమాని హారతి ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Mamitha Baiju : ‘ప్రేమలు’ హీరోయిన్‌‌కి హారతి ఇచ్చిన తెలుగు అభిమాని.. ఆశ్చర్యపోయిన మమిత బైజు ..

Fan Shows his fondness to premalu movie fame Actress Mamitha Baiju

Updated On : March 16, 2024 / 12:17 PM IST

Mamitha Baiju : మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమా హీరోయిన్ మమిత బైజు అయితే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. మలయాళంలో ఆల్మోస్ట్ 15 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది. మళయాళంలోనే కాక తెలుగులో కూడా పేరు, అభిమానులని ఈ ఒక్క సినిమాతో సంపాదించుకుంది మమిత.

మమిత బైజు నటనకు, క్యూట్ నెస్ కి, తన అందానికి తెలుగు యువత ఫిదా అయిపోయారు. గత నాలుగు రోజులుగా మమిత బైజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక తెలుగు ప్రమోషన్స్ లో చీరలో పాల్గొనడంతో ఆమెని సాయి పల్లవితో పోలుస్తూ తెగ ప్రమోట్ చేస్తున్నారు. అయితే ప్రేమలు మీమర్స్ మీట్ లో హీరోయిన్ మమిత బైజుకి ఓ అభిమాని హారతి ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Also Read : Venkatesh : సింపుల్‌గా వెంకీమామ రెండో కూతురి పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రేమలు మీమర్స్ మీట్ లో ఓ అభిమాని.. మమిత బైజుని సినిమా చూసిన దగ్గర్నుంచి అభిమానిస్తున్నట్టు చెప్పి, చాలా నచ్చారని చెప్పి నా అభిమానాన్ని చూపిస్తాను అంటూ స్టేజి ఎక్కి ఓ పళ్లెంలో హారతి వెలిగించి మమిత బైజుకి హారతి ఇచ్చాడు. దీంతో హీరోయిన్ తో పటు స్టేజి మీద ఉన్నవాళ్లు, ఆ ప్రెస్ మీట్ కి వచ్చిన వాళ్ళు అంతా ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా కొంతమంది ట్రోల్ చేస్తుంటే కొంతమంది మాత్రం అభిమానం ఇలా చూపిస్తున్నాడు అంటూ అభినందిస్తున్నారు. ఇక మమిత ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.