Venkatesh : సింపుల్‌గా వెంకీమామ రెండో కూతురి పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

వెంకటేష్ రెండో కూతురి వివాహం చాలా సింపుల్ గా హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.

Venkatesh : సింపుల్‌గా వెంకీమామ రెండో కూతురి పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

Venkatesh Second Daughter Havya Vahini Wedding Happened in Ramanaidu Studio

Updated On : March 16, 2024 / 9:39 AM IST

Venkatesh Daughter Marriage : విక్టరీ వెంకటేష్ ఇటీవల సంక్రాంతికి సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. తాజాగా తన రెండో కూతురు పెళ్లిని వెంకీమామ చాలా సింపుల్ గా చేయడం గమనార్హం. గత సంవత్సరం అక్టోబర్ లో వెంకీమామ రెండో కూతురు హవ్యవాహిని – విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ తో నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకకు చిరంజీవి, మహేష్ బాబు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

తాజాగా నిన్న రాత్రి వెంకటేష్ రెండో కూతురి వివాహం చాలా సింపుల్ గా హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. నిన్న మార్చ్ 15 శుక్రవారం రాత్రి విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు తనయుడు డాక్టర్ నిషాంత్‏‌తో వెంకటేష్ రెండో కూతురు హ‌వ్య‌వాహిని వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకని కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్ గా చేయడం గమనార్హం.

Venkatesh Second Daughter Havya Vahini Wedding Happened in Ramanaidu Studio

Also Read : Upasana : క్లిన్ కారతో కలిసి రాష్ట్రపతిని కలిసిన ఉపాసన.. పాప ఫేస్ ఇంకెప్పుడు చూపిస్తారు అంటున్న ఫ్యాన్స్..

ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమ నుంచి దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలు మాత్రమే హజరయ్యారు. సాధారణంగా సినీ సెలబ్రిటీల ఇంట్లో వివాహ వేడుకలు గ్రాండ్ గా జరుగుతాయి. కానీ వెంకటేష్ మాత్రం చాలా సింపుల్ గా చేయడం విశేషం. ఇక వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉండగా పెద్దమ్మాయి ఆశ్రితకు 2019లో పెళ్లి జరిగింది. ఇప్పుడు రెండో కూతురు పెళ్లి జరిగింది.