Upasana : క్లిన్ కారతో కలిసి రాష్ట్రపతిని కలిసిన ఉపాసన.. పాప ఫేస్ ఇంకెప్పుడు చూపిస్తారు అంటున్న ఫ్యాన్స్..

తాజాగా ఉపాసన నేడు తన కూతురు క్లిన్ కారాతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసింది.

Upasana : క్లిన్ కారతో కలిసి రాష్ట్రపతిని కలిసిన ఉపాసన.. పాప ఫేస్ ఇంకెప్పుడు చూపిస్తారు అంటున్న ఫ్యాన్స్..

Upasana Meets President Droupadi Murmu Ji with daughter KlinKaara Konidela

Updated On : March 15, 2024 / 10:35 PM IST

Upasana : రామ్ చరణ్(Ram Charan) భార్యగానే కాక, బిజినెస్ ఉమెన్ గా కూడా ఉపాసన చాలా పాపులర్. ఉపాసన రెగ్యులర్ గా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక చరణ్ – ఉపాసనల కూతురు క్లిన్ కార(Klin Kaara) ఫొటోలు షేర్ చేసినా ఎక్కడా ఫేస్ రివీల్ కాకుండా షేర్ చేస్తారు.

తాజాగా ఉపాసన నేడు తన కూతురు క్లిన్ కారాతో కలిసి హైదరాబాద్ లో మెడిటేషన్ కి సంబంధించి జరుగుతున్న గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమలేష్ దాజిని కలిసింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

రాష్ట్రపతిని కలిసిన ఫోటోలని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. నేడు ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ లో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముజీ గారిని నా కుమార్తె క్లిన్‌ కారా కొణిదెలతో కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కామేష్ దాజి మీకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Also Read : Allu Arjun : అల్లుఅర్జున్‌ని పట్టుకొని ఏడ్చేసిన అభిమాని.. వైరల్ అవుతున్న వీడియో..

అయితే ఒక ఫొటోలో క్లిన్ కారా కూడా ఉన్నా ఎప్పటిలాగే ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడింది ఉపాసన. దీంతో అభిమానులు ఇంకెప్పుడు ఈ మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ ని చూపిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.