Kajol : మొన్న రష్మిక.. నేడు కాజోల్.. ఆగని డీప్‌ఫేక్ వీడియో ఆగడాలు..

మొన్న రష్మికకు ఎదురైన సమస్య నేడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ కి ఎదురైంది. ఎవరో మహిళ తన అవుట్ ఫిట్ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుంటున్న వీడియోకి..

Bollywood heroine Kajol deepfake video gone viral

Kajol : రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ఇటీవల నేషనల్ వైడ్ పెద్ద చర్చకు దారి తీసింది. ఇలాంటి ఆగడాలను అడ్డుకోకపోతే ఆడవాళ్లు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక ఈ విషయాన్ని గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకోని.. సోషల్ మీడియా వేదికలకు కొత్త రూల్ రిమైండర్లను పంపింది. వాటిని అధిగమిస్తే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుందంటూ ప్రకటించినా.. ఇంకా ఆ ఆగడాలు ఆగడం లేదు.

మొన్న రష్మికకు ఎదురైన సమస్య నేడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ కి ఎదురైంది. ఎవరో మహిళ తన అవుట్ ఫిట్ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుంటున్న వీడియోకి కాజోల్ పేస్ మార్ఫింగ్ చేసి పెట్టారు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది. అయితే దీని మీద వెంటనే చర్యలు తీసుకోవడంతో వీడియో ఎక్కువ వ్యాప్తి చెందకుండా చేయగలిగారు. ఒరిజినల్ వీడియోలో ఉన్నది ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అని సమాచారం. ఇలాంటి వాటికీ పాల్పడుతున్న వారి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే గాని వీటికి ముగింపు పడదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

Also read : Anchor Suma : పోలీసులతో గొడవ పెట్టుకున్న యాంకర్‌ సుమ తనయుడు.. వీడియో వైరల్..

కాగా రష్మిక మందన్న వీడియో పై ఆమె ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టి మాట్లాడారు. “ఇలాంటి వాటి పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రతి సాఫ్ట్‌వేర్ కి లైసెన్స్ కంపల్సరీ అనే రూల్ తీసుకు రావాలి. ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ అందరికి అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ముందుగా అరికట్టాలి” అంటూ చెప్పుకొచ్చారు. రక్షిత్ కామెంట్స్ పై నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న AI టెక్నాలజీ వల్లే ఈ సమస్యలన్నీ, దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.