Anchor Suma : పోలీసులతో గొడవ పెట్టుకున్న యాంకర్‌ సుమ తనయుడు.. వీడియో వైరల్..

సుమ కొడుకు పోలీసులతో గొడవ పెట్టుకొన్న వీడియో వైరల్ గా మారింది. అసలు ఏమైంది..?

Anchor Suma : పోలీసులతో గొడవ పెట్టుకున్న యాంకర్‌ సుమ తనయుడు.. వీడియో వైరల్..

Anchor Suma son wrong behaviour with police video viral

Updated On : November 16, 2023 / 5:05 PM IST

Anchor Suma : టాలీవుడ్ యాంకర్ సుమ తనయుడు రోషన్‌ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘బబుల్ గమ్’ సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అవ్వబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టింది. ఈక్రమంలోనే టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా సుమ కొడుకు పోలీసులతో గొడవ పెట్టుకొన్న వీడియో వైరల్ గా మారింది. అసలు ఏమైంది..?

ఇటీవల కాలంలో సినిమా ప్రమోషన్స్ ని వెరైటీగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరహాలోనే రోషన్ కూడా తన సినిమా ప్రమోషన్స్ కోసం పోలీసులతో గొడవకు దిగాడు. వాళ్ళు నిజమైన పోలీసులు అనుకున్నారేమో. ఆ పోలీసులు కూడా డూప్లికేటే. ‘బబుల్ గమ్’ సినిమా ప్రమోషన్స్ కోసం రోషన్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో సుమ తనయుడు యాక్టింగ్ చూడడండి.

Also read : Devara : ఎన్టీఆర్ ‘దేవర’ ఆ కుర్రాడి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఆ అబ్బాయి ఎవరో తెలుసా..?

కాగా ఈ సినిమాని రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ దర్శకుడు క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఇక ఈ రెండు సినిమాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల ఈ మూవీకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి సినిమాలోనే రోషన్ హీరోయిన్ కి లిప్ కిస్ ఇచ్చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తుంది. డిసెంబర్ 29న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి సుమ కొడుకు హీరోగా సక్సెస్ అవుతాడా..? లేదా..? చూడాలి.