Devara : ఎన్టీఆర్ ‘దేవర’ ఆ కుర్రాడి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఆ అబ్బాయి ఎవరో తెలుసా..?
ఎన్టీఆర్ 'దేవర' మూవీ సెట్స్ లో బర్త్ డే సెలబ్రేషన్స్. ఆ పుట్టినరోజు వ్యక్తి ఎవరో తెలుసా..?

Birthday celebrations in NTR Devara sets photos viral
Devara : ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. షెడ్యూల్ మీద షెడ్యూళ్లు పూర్తి చేస్తూ మూవీని ముందుకు తీసుకు వెళ్తున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. ఇక యాక్షన్ పార్ట్ అండ్ VFX కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దించారు.
దివాళీ పండుగ బ్రేక్ తరువాత ఈ మూవీ షూటింగ్ మళ్ళీ మొదలయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు సినిమాలోని ప్రధాన పాత్రలు పై కీలక సన్నివేశాలను మూవీ టీం తెరకెక్కిస్తోంది. ఇక ఈ మూవీ సెట్స్ నుంచి ఏదొక ఫోటో షేర్ చేస్తూ అప్డేట్స్ ఇచ్చే రత్నవేలు.. తాజాగా ఒక బర్త్ డే పిక్ ని షేర్ చేశారు. ఆ ఫొటోలో ఒక కుర్రాడి పుట్టినరోజుని రత్నవేలు, కొరటాల శివ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు..?
Wish you a Happy Birthday my dear son #aadith sai ❤️❤️ Budding cinematographer ? pic.twitter.com/VQhRHiIqKP
— Rathnavelu ISC (@RathnaveluDop) November 15, 2023
ఆ కుర్రాడు పేరు ఆదిత్ సాయి. అతను రత్నవేలు కొడుకు. తన తండ్రి లాగానే అతను కూడా కెమెరా మెన్ గా మరోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శిక్షణలో భాగంగా తండ్రి దగ్గరే శిష్యరికం చేస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే దేవర కెమెరా యూనిట్ ఆదిత్ పాల్గొని శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక నిన్న అతని పుట్టినరోజు కావడంతో మూవీ సెట్స్ లో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు.
ఇక ఈ పిక్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు.. బర్త్ డే విషెస్ తెలియజేస్తూనే ఎన్టీఆర్ తో ఉన్న ఫోటో కూడా షేర్ చేయొచ్చుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. మొదటి బాగానే వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్స్ గా కనిపించబోతున్నారు.