Amitabh Bachchan : అమితాబ్ బ‌చ్చ‌న్ సార్‌.. మీరు ఫైన‌ల్ మ్యాచ్ చూడ‌కండి ప్లీజ్‌.. నెటీజ‌న్ల విన్న‌పం.. ఎందుకో తెలుసా..?

Team India fans appeal to Amitabh Bachchan : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. అయితే.. . ఫైన‌ల్ మ్యాచ్‌ను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ చూడొద్ద‌ని నెటీజ‌న్లు కోరుతున్నారు.

Amitabh Bachchan : అమితాబ్ బ‌చ్చ‌న్ సార్‌.. మీరు ఫైన‌ల్ మ్యాచ్ చూడ‌కండి ప్లీజ్‌.. నెటీజ‌న్ల విన్న‌పం.. ఎందుకో తెలుసా..?

Team India fans appeal to Amitabh Bachchan

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. క‌ప్పును ముద్దాడేందుకు అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అయితే.. ఈ మ్యాచ్‌ను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ చూడొద్ద‌ని నెటీజ‌న్లు కోరుతున్నారు. ద‌య‌చేసి ఆ ఒక్క రోజు ఏదైన ప‌నిలో నిమ‌గ్నం క‌మ్మ‌ని చెబుతున్నారు. కాగా.. నెటీజ‌న్లు ఇలా చెప్ప‌డానికి కూడా ఓ కార‌ణం ఉంది. సెమీ ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం అమితాబ్ చేసిన ట్వీటే అందుకు కార‌ణం.

వాంఖ‌డే వేదిక‌గా బుధ‌వారం జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు చేరుకుంది. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇక టీమ్ఇండియా గెలుపొందిన త‌రువాత అమితాబ్ బచ్చ‌న్ చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ‘నేను చూడ‌ని స‌మ‌యంలోనే మ‌నం గెలుస్తాం.’ అని అమితాబ్ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు.

Kane Williamson : వాంఖ‌డే పిచ్ మార్పు వివాదం పై కేన్ విలియ‌మ్స‌న్‌.. చాలా బాధ‌గా ఉంది

దీన్ని చూసిన నెటీజ‌న్లు.. అమితాబ్‌కు ఓ విన్న‌పం చేస్తున్నారు. ద‌య‌చేసి మీరు ఫైన‌ల్ మ్యాచ్ చూడ‌కండి సార్‌.. అంటూ అత‌డిని కోరుతున్నారు. మీ నాన్న మీద ఒట్టు.. ఫైనల్ మాత్రం చూడొద్దు అని ఓ నెటీజ‌న్ కామెంట్ చేయ‌గా, ఫైన‌ల్ మ్యాచ్ రోజు క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకోవాల‌ని మ‌రో నెటిజ‌న్ అన్నారు. చూడాలి మ‌రీ అమితాబ్ బ‌చ్చ‌న్ నెటీజ‌న్ల కామెంట్ల‌కు ఎలాంటి రిప్లై ఇస్తారో.

అమితాబ్ ద‌గ్గ‌ర గోల్డెన్ టికెట్‌..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభానికి ముందు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అమితాబ్ బ‌చ్చన్‌కు గోల్డెన్ టికెట్‌ను అందించింది. దీని ద్వారా ఎలాంటి టికెట్ కొనుగోలు చేయ‌కుండా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లు జ‌రిగే స్టేడియాల్లోకి వెళ్లి వీఐపీ బాక్స్‌లో కూర్చోని ప్ర‌త్య‌క్షంగా మ్యాచ్‌ను చూడొచ్చు. అమితాబ్ బ‌చ్చ‌న్‌తో పాటు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌, ర‌జినీకాంత్‌ల‌కు కూడా బీసీసీఐ ఈ గోల్డెన్ టికెట్‌ను అందించింది.

 

వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా స‌చిన్ టెండూల్క‌ర్‌, ముకేశ్ అంబానీ, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, సిద్ధార్థ్ కియారా దంప‌తులు, ఫుట్ బాట్ దిగ్గ‌జం డేవిడ్ బెక్ హామ్ ల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రెటీలు చూశారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. వ‌న్డేల్లో యాభై సెంచ‌రీలు చేసిన మొద‌టి ఆట‌గాడిగా కోహ్లీ నిలిచాడు.

Rohit Sharma : అదేజరిగితే మేం ఇబ్బందుల్లో పడేవాళ్లం.. సెమీఫైనల్ లో విజయం తరువాత రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ 4 వికెట్ల న‌ష్టానికి 397 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ (117), శ్రేయ‌స్ అయ్య‌ర్ (105) లు సెంచ‌రీలు చేశారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో కివీస్ 48.5 ఓవ‌ర్ల‌లో 327 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ 70 ప‌రుగుల తేడాతో ఘ‌న విజయం సాధించి ఈ మెగాటోర్నీలో ఓట‌మే ఎగుర‌ని జ‌ట్టుగా ఫైన‌ల్‌కు చేరుకుంది.