Kane Williamson : వాంఖ‌డే పిచ్ మార్పు వివాదం పై కేన్ విలియ‌మ్స‌న్‌.. చాలా బాధ‌గా ఉంది

వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన మొద‌టి సెమీ ఫైన‌ల్‌లో భార‌త జ‌ట్టు న్యూజిలాండ్ పై ఘ‌న విజ‌యం సాధించింది.

Kane Williamson : వాంఖ‌డే పిచ్ మార్పు వివాదం పై కేన్ విలియ‌మ్స‌న్‌.. చాలా బాధ‌గా ఉంది

Kane Williamson

Kane Williamson- Pitch Swap Controversy : వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన మొద‌టి సెమీ ఫైన‌ల్‌లో భార‌త జ‌ట్టు న్యూజిలాండ్ పై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు కొద్ది స‌మ‌యం ముందు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు పిచ్‌ను మార్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టికే దీనిపై ఐసీసీ వివ‌ర‌ణ ఇచ్చింది. ఇక మ్యాచ్ అనంత‌రం ఈ వివాదం పై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ స్పందించాడు.

పిచ్ విష‌యంలో త‌మ‌కు ఎలాంటి ఇబ్బందులు లేవ‌న్నాడు. ఈ పిచ్ పై ప‌లు మ్యాచులు జ‌రిగాయి. అయిన‌ప్ప‌టికీ చాలా బాగుంది. రెండు జ‌ట్ల‌కు కూడా అనుకూలంగానే ఉంద‌న్నాడు. ఆరంభంలో టీమ్ఇండియా బ్యాట‌ర్లు వేగంగా ప‌రుగులు రాబ‌ట్టారు. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా భార‌త ఆట‌గాళ్లు త‌మ ఆట‌తీరును మార్చుకున్న‌ట్లుగా క‌నిపించింద‌న్నారు. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ నాకౌట్ మ్యాచ్‌లో ఓడిపోవ‌డం మాత్రం బాధ‌క‌లిగించింద‌ని చెప్పుకొచ్చాడు.

ఇలాంటి జ‌ట్టును ఓడించ‌డం క‌ష్టం..

ఏడు వారాల అద్భుత ప్ర‌యాణం ముగిసింది. కొన్ని జ్ఞాప‌కాలు గుర్తుండిపోతాయి. అత్యుత్త‌మ జ‌ట్టు చేతిలోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర‌మించాం. భార‌త జ‌ట్టు ప్ర‌స్తుతం అద్భుతంగా ఆడుతోంద‌ని కేన్ మామ చెప్పాడు.

Rohit Sharma : అదేజరిగితే మేం ఇబ్బందుల్లో పడేవాళ్లం.. సెమీఫైనల్ లో విజయం తరువాత రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

గ‌త ఓట‌ముల నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా టీమ్ఇండియా ప్ర‌స్తుతం ముందుకు సాగుతోంది. అందుక‌నే ఒక్క మ్యాచులోనూ ఓడిపోకుండా ఫైన‌ల్‌కు చేరుకుంది. ఇలాంటి జ‌ట్టును ఓడించ‌డం క‌ష్టం. అయిన‌ప్ప‌టికీ మా ఆట‌గాళ్లు ఆఖ‌రి వ‌ర‌కు పోరాడారు. అని విలియ‌మ్స‌న్ అన్నాడు.

పిచ్ మార్పుపై ఐసీసీ ఏమ‌ని చెప్పిందంటే..?

సుదీర్ఘంగా సాగే ఇలాంటి మెగా టోర్నీల‌లో పిచ్ ప్ర‌ణాళిక‌ల్లో మార్పులు స్వ‌ర సాధార‌ణం అని ఐసీసీ చెప్పింది. ఇప్ప‌టికే కొన్నిసార్లు ఇలాంటి మార్పులు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. ఐసీసీ స్వ‌తంత్ర పిచ్ స‌ల‌హాదారుకు సైతం పిచ్ మార్పు గురించి తెలియ‌జేసిన‌ట్లు తెలిపింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 398 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (117), శ్రేయ‌స్ అయ్య‌ర్ (105) సెంచ‌రీలు చేశారు. శుభ్‌మ‌న్ గిల్ (80) అర్ధ‌శ‌త‌కం చేయ‌గా, రోహిత్ శ‌ర్మ (47) ఆఖ‌ర్లో కేఎల్ రాహుల్ (39నాటౌట్‌) వేగంగా ఆడారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో టిమ్ సౌథీ మూడు, బోల్ట్ ఓ వికెట్ తీశారు.

Anushka Sharma Viral Post : భర్త కోహ్లీపై అనుష్కా శర్మ తాజా కామెంట్… వైరల్ అయిన సోషల్ మీడియా పోస్టు

అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవ‌ర్ల‌లో 327 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో డారిల్ మిచెల్ (134) శ‌త‌కం బాదాడు. కేన్ విలిమ‌య్స‌న్ (69) రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో న్యూజిలాండ్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ ఏడు వికెట్లు తీసి కివీస్ ప‌త‌నాన్ని శాసించాడు. బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.